E-Paper
Advertisement

ఒక్క సిప్ తాగితే చాలు మైమరచిపోవాల్సిందే.. ఈ స్పైసీ చికెన్ సూప్ సీక్రెట్ ఇదే!

ఒక్క సిప్ తాగితే చాలు మైమరచిపోవాల్సిందే.. ఈ స్పైసీ చికెన్ సూప్ సీక్రెట్ ఇదే!
Advertisement

Chili Crisp Chicken and Corn Soup: సాయంత్రం వేళ చల్లని గాలి వీస్తున్నప్పుడు లేదా కాస్త గొంతు గరగరగా ఉన్నప్పుడు వేడివేడిగా, ఘాటుగా ఏదైనా తాగాలనిపిస్తుంటుంది కదా. సాధారణంగా మనం రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఆర్డర్ చేసే స్వీట్ కార్న్ చికెన్ సూప్ ఎప్పుడూ ఒకే రుచిలో ఉంటుంది. కానీ దానికి కాస్త స్పైసీ టచ్ ఇస్తూ.. క్రిస్పీ చిల్లీ ఆయిల్ కలిపితే వచ్చే ఆ రుచే వేరు. ఒక్క సిప్ తాగగానే నోటికి తగిలే ఆ మిరపకాయల ఘాటు, స్వీట్ కార్న్ తీపిదనం, మెత్తని చికెన్ ముక్కల కలయిక మినల్ని మరో లోకానికి తీసుకెళ్తుంది. బయట దొరికే సూప్స్ కంటే ఎంతో ఆరోగ్యకరంగా, కేవలం 20 నిమిషాల్లోనే ఇంట్లో ఉన్న పదార్థాలతో ఈ అద్భుతమైన రెసిపీ తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూసేద్దాం..

కావాల్సిన పదార్థాలు:

బోన్‌లెస్ చికెన్ – పావు కిలో
స్వీట్ కార్న్ గింజలు – ఒక కప్పు
చికెన్ స్టాక్ లేదా నీళ్లు – నాలుగు కప్పులు
చిల్లీ క్రిస్ప్ ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – ఆరు
అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్
స్ప్రింగ్ ఆనియన్స్ (ఉల్లికాడలు) – మూడు
సోయా సాస్ – ఒక టేబుల్ స్పూన్
వెనిగర్ – ఒక టీస్పూన్
కార్న్ ఫ్లోర్ – రెండు టేబుల్ స్పూన్లు
గుడ్డు – ఒకటి
మిరియాల పొడి – అర టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – ఒక టేబుల్ స్పూన్

Advertisement

Also Read: అర్ధరాత్రి స్వీట్ క్రేవింగ్స్ తీర్చే ఇన్‌స్టంట్ ‘ఎమర్జెన్సీ చాక్లెట్ కేక్’.. ఓవెన్ లేకుండా 10 నిమిషాల్లోనే రెడీ!

తయారీ విధానం:

స్టవ్ మీద ఒక లోతైన గిన్నె పెట్టి అందులో నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకున్న బోన్‌లెస్ చికెన్, స్వీట్ కార్న్ గింజలు వేసి రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద టాస్ చేయాలి.

Advertisement

ఆ తర్వాత అందులో నాలుగు కప్పుల నీళ్లు లేదా చికెన్ స్టాక్ పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టాలి. చికెన్ ముక్కలు మెత్తగా ఉడికి, స్వీట్ కార్న్ మృదువుగా మారే వరకు సుమారు పది నిమిషాలు మరిగించాలి.

ఇప్పుడు మంటను తగ్గించి సోయా సాస్, వెనిగర్, మిరియాల పొడి వేసి కలపాలి. సూప్ కాస్త చిక్కగా రావడం కోసం ఒక చిన్న గిన్నెలో కార్న్ ఫ్లోర్ తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని మరుగుతున్న సూప్‌లో పోస్తూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. సూప్ చిక్కబడటం మొదలయ్యాక బాగా గిలకొట్టిన గుడ్డు సొనను సన్నని ధారలా పోస్తూ నెమ్మదిగా కలపాలి. దీనివల్ల సూప్‌లో అందమైన ఎగ్ డ్రాప్స్ ఏర్పడతాయి.

చివరగా స్టవ్ ఆపేసి, మనం రెడీగా ఉంచుకున్న చిల్లీ క్రిస్ప్ ఆయిల్, సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి ఒక్కసారి కలిపితే సరిపోతుంది. వేడివేడిగా బౌల్స్‌లో సర్వ్ చేసుకుని ఆస్వాదించడమే ఇక.

Also Read: చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే గోల్డెన్ మిల్క్.. ఎప్పుడు తాగాలి? ఎలా చేసుకోవాలి?

Tags

Related News

ముక్కుపై బ్లాక్‌హెడ్స్‌తో ఇబ్బందిగా ఉందా? ఇంట్లోనే ఈ సింపుల్ ఫేస్ మాస్క్ ట్రై చేయండి

రోజూ తినే ఎగ్ కర్రీ బోర్ కొట్టిందా?అయితే ఈ మెంతి కోడిగుడ్డు కూర ట్రై చేయండి!

మినప అప్పడాలు..ఇలా చేస్తే బయటి వాటి కంటే మంచి రుచి!

అమ్మమ్మల కాలం నాటి బీరకాయ రోటి పచ్చడి..సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ!

చాక్లెట్లు, బొమ్మల ఆశ చూపించి పిల్లలను మోసం చేసే వారితో జాగ్రత్త.. తల్లిదండ్రులు ఈ 7 విషయాలు నేర్పాలి

మీకు తెలుసా నెమళ్లు విషపూరిత పాములను చంపి తిన్నా చనిపోవు.. ఎందుకంటే

తొలి పరిచయంలోనే ఆకట్టుకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఆకర్షణ ఎక్కువ

విదుర నీతి.. ఈ 4 గుణాలు ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి వస్తుంది.. డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు?

Big Stories

Advertisement
×