E-Paper
Advertisement

బ్లూ శారీలో సౌమ్య టాండన్ మెరుపులు.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు!

బ్లూ శారీలో సౌమ్య టాండన్ మెరుపులు.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు!
Advertisement

Saumya Tandon:సౌమ్య టాండన్ …నాలుగు పదుల్లోకి అడుగు పెట్టినా ఇంకా ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటూ తనదైన గ్లామర్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఈ వెటరన్ బ్యూటీ.ఇదిగో తాజాగా నెట్టింట్లో షేర్ చేసిన ఈ భామ షేర్ చేసిన క్రేజీ పిక్స్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.

ఈ ఫోటోల్లో బ్లూ కలర్ చీరలో అందంగా కనిపిస్తూ ఫాలోవర్స్ ని ఫిదా చేస్తుంది.ఇక ఈ చీరపై ఉన్న చెక్స్ డిజైన్, అక్కడక్కడా కనిపిస్తున్న ఫ్లోరల్ వర్క్, దానికి మ్యాచింగ్‌గా డిజైన్ చేసిన బ్లౌజ్ త లుక్‌కు మరింత స్పెషాలిటీని తీసుకొచ్చాయనే చెప్పాలి.

Advertisement

ఇక ఈ ఫోటోను షేర్ చేస్తూ ‘Saree always makes it work. Before an event’ అంటూ క్రేజీ క్యాప్షన్ జోడించడంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్.మొత్తంగా ఏ ఈవెంట్‌కు వెళ్లే ముందు అయినా చీరకట్టుకు ఉండే ప్రత్యేకతే వేరని చెప్పకనే చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

మాములుగా సెలబ్రిటీలు ఫ్యాషన్ విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతుంటారని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. వెస్ట్రన్ వేర్ నుంచి డిజైనర్ అవుట్‌ఫిట్స్ వరకు రకరకాల లుక్స్‌తో అభిమానులను అలరిస్తుంటారు. అయితే సౌమ్య టాండన్ మాత్రం చీరలో కూడా తనదైన స్టైల్‌ను చూపిస్తూ ఆకట్టుకోవడం ఇక్కడ విశేషం.

Advertisement

ALSO READ :బిందె పాటలకి ఈ క్రేజ్ ఏంటి మావా ..మాధురి రాథోడ్ నుండి యమునా తారక్ దాకా !

ఇక సౌమ్య టాండన్ కెరీర్ విషయానికి వస్తే..ఈ భామ హిందీ ఆడియన్స్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ సంపాదించింది. ముఖ్యంగా పాపులర్ టీవీ కామెడీ షో ‘భాభీజీ ఘర్ పర్ హై!’లో అనితా మిశ్రా పాత్రతో ఆడియన్స్ లో ఎక్కడలేని పాపులారిటీని కొట్టేసింది.

ముఖ్యంగా ఈ సీరియల్‌లో ఆమె నటన, కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అయితే దీని కంటే ముందే 2007లో వచ్చిన ఇంతియాజ్ అలీ దర్శకత్వంలోని ‘జబ్ వి మెట్’ సినిమాతో వెండితెరపై సత్తా చాటింది ఈ అమ్మడు.షాహిద్ కపూర్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రూప్ పాత్రలో కనిపించి మెప్పించింది.

ఇక ఆ తర్వాత ‘వెల్‌కమ్ టు పంజాబ్’, ‘రేడియో ఘైంట్’ వంటి సినిమాల్లో నటించిన సౌమ్య రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమాలో ఉల్ఫత్ పాత్రలో కనిపించి మరోసారి తన సత్తా చాటింది .ఇక. ‘ధురంధర్: ది రివెంజ్’లోనూ తన పాత్రతో ప్రేక్షకులను అలరించింది.

మొత్తంగా ఒకవైపు సరికొత్త పాత్రలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటున్న సౌమ్య తాజాగా మరోసారి తనవైన క్రేజీ పిక్స్ షేర్ చేసి మరోసారి మీడియాలో హైలెట్ అవుతుంది.

ALSO READ :పాలమూరు జంగిరెడ్డి పాటలకు ఫుల్ క్రేజ్.. పల్లె గొంతుక నుంచి సినిమా పాటల వరకు!

Tags

Related News

మృణాల్ ఠాకూర్ స్టైలిష్ లుక్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదరగొట్టేస్తోందిగా!

రామకృష్ణకు అప్పటికే పెళ్లైందా? గీతాంజలి కొడుకు షాకింగ్ కామెంట్స్!

సీఎం విజయ్ కు ధనుష్ స్పెషల్ థాంక్స్..ఎందుకంటే?

హైదరాబాద్ వేదికగా గ్లోబల్ హంగామా.. టాలీవుడ్ రెడీ!

ఏడాది జైలు శిక్ష.. కోర్టు తీర్పుపై బండ్ల గణేశ్ రియాక్షన్ వైరల్!

రూ.50 పెట్టుబడితో ఈ స్థాయిలో ఉన్నా.. అలీ సక్సెస్ సీక్రెట్ అదేనా?

వారణాసి విడుదల వాయిదా?కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?

15 నిమిషాల కార్ జర్నీలో పుట్టిన పాట.. ఇప్పుడు అందరి మనసుల్లో!

Big Stories

Advertisement
×