E-Paper
Advertisement

చికెన్‌లో చింతపండు వేస్తే ఇంత టేస్టీగా ఉంటుందా? తప్పక ట్రై చేయండి!

చికెన్‌లో చింతపండు వేస్తే ఇంత టేస్టీగా ఉంటుందా? తప్పక ట్రై చేయండి!
Advertisement

Tamarind Chicken Recipe: సాధారణంగా ప్రతి ఆదివారం మనం చికెన్ కూరల్లో రకరకాల ప్రయోగాలు చేస్తుంటాం. కానీ ఎప్పుడైనా చికెన్‌లో కొద్దిగా చింతపండు వేసి వండి చూశారా? ఆ పులుపు, కారం కలయికతో వచ్చే రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఇలా వండి పెడితే ఇంట్లో అందరూ లొట్టలేసుకుని తినేస్తారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా నోటికి కారకారంగా, పుల్లపుల్లగా కొత్త రుచిని ఆస్వాదించాలనుకునే వారికి ఈ చింతపండు చికెన్ బాగా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే మీ ఇంట్లో ఈ స్పెషల్ డిష్ ట్రై చేసి అందరినీ ఆశ్చర్యపరచండి మరి.

కావాల్సిన పదార్థాలు:

చికెన్ – ముప్పవు కేజీ
చింతపండు రసం – అర కప్పు
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 5
టమోటాలు – 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
కారం – 2 టీస్పూన్లు

Advertisement

Also Read: మద్యం మానాలనే కోరిక ఉన్నా వదల్లేని స్థితి.. అధ్యయనంలో బయటపడిన షాకింగ్ నిజాలు!
పసుపు – అర టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
నూనె – 4 టేబుల్ స్పూన్లు
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తిమీర – గుప్పెడు
ఉప్పు – తగినంత

తయారీ విధానం:

ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి వేడెక్కాక కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేగనివ్వాలి. ఇప్పుడు టమోటా ముక్కలు చేర్చి మెత్తగా ఉడికే వరకు వేయించాలి.

Advertisement

ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో శుభ్రం చేసిన చికెన్ ముక్కలను వేసి, మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా కలిపి మూత పెట్టి పది నిమిషాలు చిన్న మంటపై ఉడకనివ్వాలి. చికెన్ నుండి నీరు బయటకు వచ్చి సగం ఉడికిన తర్వాత చింతపండు రసం, కొద్దిగా నీళ్లు పోసి మళ్లీ మూత పెట్టాలి. చికెన్ మెత్తగా ఉడికి గ్రేవీ దగ్గరకు పడుతున్నప్పుడు గరం మసాలా, కొత్తిమీర చల్లుకుని దింపేస్తే ఎంతో రుచికరమైన చింతపండు చికెన్ సిద్ధమవుతుంది. వేడి వేడి అన్నంలోకి ఇది అద్భుతంగా ఉంటుంది.

Also Read: ఎనర్జీ ఇస్తుందనుకుంటే.. ప్రాణాలకే ఎసరు పెడుతోంది.. తల్లిదండ్రులూ జాగ్రత్త!

Tags

Related News

మటన్ చాప్స్ రోస్ట్ ఇలా చేయండి.. ఒక్కసారి తింటే మళ్లీ ఇదే కావాలంటారు!

చెత్తకుండీలు లేకుండానే దేశమంతా క్లీన్.. జపాన్ పరిశుభ్రత సీక్రెట్ ఇదే

ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 ఫుడ్స్ తినకూడదు

గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డే కోసం ఏ గిఫ్ట్ కొనాలా అని టెన్షన్ పడుతున్నారా? 5 బెస్ట్ ఐడియాస్ మీ కోసం

భార్య గర్భవతిగా ఉంటే భర్త క్షౌరం చేయించుకోకూడదా? అసలు నిజం ఇదే!

చిన్న బెడ్‌రూమ్‌లో కప్‌బోర్డ్ లేదా? ఈ స్మార్ట్ స్టోరేజ్ ఐడియాలతో సమస్యకు చెక్

మద్యం మానాలనే కోరిక ఉన్నా వదల్లేని స్థితి.. అధ్యయనంలో బయటపడిన షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×