E-Paper
Advertisement

పబ్‌జీ గేమ్ టాస్క్.. ఇల్లు వదిలి పారిపోయిన 14 ఏళ్ల బాలుడు.. పోలీసులు ఏం చేశారంటే?

పబ్‌జీ గేమ్ టాస్క్.. ఇల్లు వదిలి పారిపోయిన 14 ఏళ్ల బాలుడు.. పోలీసులు ఏం చేశారంటే?
Advertisement

PUBG Task: పబ్‌జీ గేమ్‌లో ఒక టాస్క్ పూర్తి చేస్తే రూ.1 లక్ష వస్తుందన్న నమ్మకంతో ఒక 14 ఏళ్ల బాలుడు ఇల్లు వదిలి వెళ్లిపోయిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. ఫిరోజాబాద్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి.. అక్టోబర్ 2న కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 రోజుల పాటు తీవ్రంగా గాలించిన పోలీసులకు ఓ ఆర్టీసీ బస్సులో నిద్రపోతూ బాలుడు కనిపించాడు. ఏమైందని ప్రశ్నించగా అతడు ఇచ్చిన సమాధానం విని పోలీసులే షాకయ్యారు.

అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. అక్టోబర్ 2న బాలుడు తన స్కూల్ బ్యాగ్‌తో ఇంటి నుంచి బయలుదేరాడు. గేమ్‌లోని టాస్క్ కు అనుగుణంగా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ వెళ్లాలని భావించినప్పటికీ ప్రయాణంలో దారి తప్పిపోయాడు. గ్వాలియర్ కు బదులు పొరపాటున ఇండోర్‌ చేరుకున్నాడు. పిల్లాడు ఎంతకీ ఇంటికి తిరిగిరాకపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని భయపడి సౌత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రంగంలోకి పోలీసులు..

Advertisement

ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీటీవీ ఫుటేజ్, బాలుడి వద్ద ఉన్న ఫోన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సిగ్నల్స్ సాయంతో బాలుడు ఇండోర్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడ నిఘా వర్గాల సహాయం తీసుకున్నారు. అక్కడి అధికారులు బాలుడు మథుర వైపు బస్సులో వెళ్తున్నట్లు చెప్పారు. దీంతో అక్టోబర్ 5న మథుర-ఫిరోజాబాద్ మార్గంలో వెళ్తున్న ఒక బస్సులో బాలుడు నిద్రపోతుండగా పోలీసులు పట్టుకుని, సురక్షితంగా రక్షించారు.

పబ్‌జీకి బానిసైన బాలుడు

తండ్రి చనిపోయినప్పటి నుంచి బాలుడు ఫోన్ గేమింగ్‌కు విపరీతంగా అలవాటు పడ్డాడని, ఎక్కువ సమయం ఆన్‌లైన్ గేమ్‌లలోనే గడిపేవాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్పీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. సాంకేతికత, సీసీటీవీ ఆధారంగానే బాలుడిని కనిపెట్టగలిగామని చెప్పారు. పిల్లోడిని సురక్షితంగా తీసుకొచ్చిన పోలీస్ బృందాన్ని కుటుంబ సభ్యులు అభినందించారు. మొబైల్స్‌లో పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement

Also Read: టెలికాం రంగంలో సంచలనం.. 126 కోట్లకు చేరిన మొబైల్ యూజర్లు.. ట్రాయ్ రిపోర్టులో షాకింగ్ లెక్కలు!

గతంలోనూ ఇదే తరహాలో..

ఆన్‌లైన్ ఆటలు, ఛాలెంజ్‌ల ప్రభావంతో పిల్లలు ఇల్లు వదిలి వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఆగస్టులో మీరట్‌లో ఇద్దరు పిల్లలు సైతం ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. యూట్యూబ్ లో ’24 గంటల ఛాలెంజ్’ చూసి 11, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఇల్లు వదిలి A ఫామ్‌హౌస్ దగ్గర దాక్కున్నారు. 2020లో హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన మరో ఘటనలో 17 ఏళ్ల విద్యార్థి కూడా పబ్‌జీ టాస్క్ కోసమని ఇల్లు వదిలి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వరకు వెళ్లాడు. అప్పట్లో కూడా పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగానే అతడిని వెతికి పట్టుకున్నారు.

Also Read: జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

Tags

Related News

సరిగా చదవలేదని అమానుష ఘటన.. 82 మంది విద్యార్థులకు అరగుండు, మహారాష్ట్రలో దారుణం

భారతీయుల కిడ్నాప్.. డబ్బులు డిమాండ్ చేయకుండా, ఫ్లైట్ టికెట్లు తీసి మరి వదిలిపెట్టిన వైనం.. ఎందుకంటే?

10 సీఎన్‌జీ బస్సులు దగ్ధం.. షార్ట్ సర్క్యూట్ కారణమా? ముంబైలో ఘటన

మహాత్మా గాంధీని అవమానించేలా రీల్.. పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్

‘దృశ్యం-3’ సినిమా చూసి ప్లాన్.. 2000 కి.మీ ప్రయాణించి.. గొడ్డలితో తండ్రి హత్య!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదం.. రంగంలోకి సుప్రీంకోర్టు.. ఎన్నికల సంఘానికి నోటీసులు

‘రే*ప్ చేస్తే చస్తామనే భయం పుట్టించాలి’.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×