Asthma: ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీని నుండి బయట పడటం కోసం రకాల మందులు, చికిత్స తీసుకునే వారు అనేక మంది ఉంటారు. కానీ కొన్ని సార్లు ఏం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ రోజు మనం ఆస్తమా సమస్య నుండి చాలా వరకు ఉపశమనం పొందగలగే పద్దతి గురించి తెలుసుకోబోతున్నాము. ఈ పద్ధతే హమ్మింగ్. అవును మీరు రోజుకు కేవలం 15 నిమిషాలు శ్వాసకోశ వ్యవస్థను క్లియర్ చేయడానికి ఈ వ్యాయామం చేయాలి. ఇది ఆస్తమా నుండి బయట పడటానికి ఉపయోగపడుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హమ్మింగ్:
ప్రతిరోజూ మీరు 15 నిమిషాలు హమ్మింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. నోరు మూసుకుని ఏదైనా హమ్ చేసినప్పుడు.. మీకు శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నిజానికి.. ఇది ముక్కులోకి ప్రవేశించే నైట్రిక్ ఆక్సైడ్ మొత్తాన్ని పెంచుతుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం హమ్మింగ్ చేసేటప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ పరిమాణం 15 రెట్లు పెరుగుతుంది.
హమ్మింగ్.. నైట్రిక్ ఆక్సైడ్‌తో పాటు చిక్కుకున్న కొన్ని సైనస్ స్రావాలను బయటకు పంపి, ఇన్ఫెక్షన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది సైనసైటిస్, ఆస్తమా రెండింటినీ తగ్గిస్తుంది.
నైట్రిక్ ఆక్సైడ్ ఎందుకు ముఖ్యమైనది ?
నైట్రిక్ ఆక్సైడ్ సహజ బ్రోంకోడైలేటర్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ వాయుమార్గాలను సడలించడానికి సహాయపడుతుంది. అవి ఎక్కువగా సంకోచించకుండా నిరోధిస్తుంది.
ఉబ్బసం :
ఆస్తమాలో ఊపిరితిత్తుల వాయుమార్గాలు ఉబ్బుతాయి. చాలా సార్లు శ్వాసనాళంలో కఫం పేరుకుపోతుంది. ఇది ఈ సమస్యను పెంచుతుంది. దీని వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. దీని వల్ల ఊపిరి ఆడకపోవడం, దగ్గు, ఛాతీ బిగుతుగా అనిపించడం , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. సైనస్ ఎక్కువగా బాక్టీరియా , ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దీని వల్ల ముక్కు మూసుకుపోయి తీవ్రమైన తలనొప్పి వస్తుంది. దీర్ఘకాలంగా సైనస్ సమస్య ఉండటం వల్ల కూడా ఆస్తమా రావచ్చు.
హమ్మింగ్ ఇతర ప్రయోజనాలు:
1. మీరు హమ్ చేసినప్పుడు.. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. అంతే కాకుండా మీరు రిలాక్స్‌గా ఉంటారు. ఇది మంచి హార్మోన్లను విడుదల చేస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. కాలానుగుణ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
2.హమ్మింగ్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
Also Read: యువతకు హార్ట్ ఎటాక్ ముప్పు.. కారణాలివేనట !
3.ఇది దృష్టిని పెంచుతుంది. మెరుగైన ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
4.ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మీకు రాత్రిపూట నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే.. హమ్మింగ్ మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అశాంతిని తగ్గిస్తుంది. అంతే కాకుండా మంచి నిద్రకు ఉపయోగపడుతుంది.
5.మీరు హమ్మింగ్ ధ్యానం సమయంలో కూడా ఓం జపించవచ్చు. కానీ హమ్మింగ్ కోసం మీరు కూర్చుని ఓం జపించాల్సిన అవసరం లేదు. మీరు ఒక పాటను కూడా హమ్ చేయవచ్చు. నిర్ణీత సమయంలో మాత్రమే హమ్ చేయవలసిన అవసరం లేదు. మీరు దీన్ని రోజులో ఏ సమయంలోనైనా చేయవచ్చు.