Nitish Kumar Reddy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు శుభవార్త అందింది. హైదరాబాద్ జట్టు స్టార్ ఆల్ రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి జట్టులో చేరనున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ {ఎన్సీఏ} బెంగళూరులో రిహాబిలిటేషన్ తీసుకుని నితిష్ కుమార్ రెడ్డి.. ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేశాడు.
Also Read: Jasprit Bumrah: ముంబైకి షాక్… బుమ్రా ఇక రావడం కష్టమే!
నితీష్ యో-యో టెస్ట్ లో 18.1 స్కోర్ నమోదు చేయడంతో ఐపీఎల్ 2025 సీజన్ ఆడేందుకు బీసీసీఐ మెడికల్ టీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి 16 తేదీ ఆదివారం రోజు {Nitish Kumar Reddy} హైదరాబాద్ జట్టుతో కలవనున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ, సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 21 ఏళ్ల ఈ ఆంధ్ర క్రికెటర్ చివరిసారిగా జనవరి 22న ఈడెన్ గార్డెన్స్ లో ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ టి-20 మ్యాచ్ సందర్భంగా జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో గాయానికి గురయ్యాడు.
అప్పటినుండి బెంగళూరులోని ఎన్సిఏ లో రీహబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం అతడు తిరిగి జట్టులోకి రాబోతున్నాడని తెలిసిన హైదరాబాద్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం ఆటగాళ్ల వేలానికి ముందు హైదరాబాద్ జట్టు నితీష్ కుమార్ రెడ్డి {Nitish Kumar Reddy} ని ఆరు కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సంవత్సరం అతడు 13 మ్యాచ్లలో 143 స్ట్రైక్ రేటుతో 303 పరుగులు చేశాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
మెల్ బోర్న్ లో జరిగిన నాలుగోవ టెస్టులో 114 పరుగులతో రాణించాడు. గత ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ విజయాలలో కీలక పాత్ర పోషించాడు. తన అద్భుత ప్రదర్శనతో ఎమర్జింగ్ ప్లేయర్ రికార్డు కూడా అందుకున్నాడు. ఈ ప్రదర్శనతోనే అతడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. అనంతరం భారత్ వేదికగా జరిగిన టి-20 సిరీస్ తో టీమ్ ఇండియాలోకి అడుగు పెట్టాడు. ఆ సిరీస్ లో బ్యాట్ తోనే కాకుండా బంతితో కూడా రాణించాడు. ఇక ఇటీవల మరోసారి ఇంగ్లాండ్ తో జరిగిన టి-20 సిరీస్ లో గాయపడిన నితీష్ కుమార్ రెడ్డి.. రెండు నెలల పాటు జట్టుకు దూరమయ్యాడు.
Also Read: Suryakumar Yadav: పాండ్యాకు బిగ్ షాక్.. ముంబై కెప్టెన్ గా ఆ డేంజర్ ప్లేయర్ !
అండర్–12, 14కు ఆడుతున్నప్పుడు మాజీ క్రికెటర్, సెలెక్టర్ ఎమెస్కే ప్రసాద్ దృష్టిలో పడ్డ నితీశ్ ఆంధ్రా క్రికెట్ ఆకాడమీకి ఎంపికయ్యాడు. అండర్–16కు ఆడుతున్నప్పుడు నాగాలాండ్‌తో మ్యాచ్‌లో 345 బంతుల్లోనే 441 పరుగులు చేసి సంచలనం సృష్టించిన నితీశ్, మీడియం పేసర్‌గా ఆ టోర్నమెంట్లో 26 వికెట్లు కూడా తీసుకున్నాడు. అనంతరం ఐపీల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి.. అద్భుతమైన ఆటతీరుతో భారత జట్టులో స్థానం సంపాదించి ఆకట్టుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి.