BigTV English

Illness: వ్యాధుల బారిన పడకుండా, ఫిట్‌గా ఉండాలంటే తినాల్సినవి ఇవే !

Illness: వ్యాధుల బారిన పడకుండా, ఫిట్‌గా ఉండాలంటే తినాల్సినవి ఇవే !

Illness: మనం తినే ఆహారం మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఏం సమయంలో తింటున్నాం, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనేవి కూడా ఆరోగ్యం విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఉదయం పూట ప్రతి ఒక్కరూ టిఫిన్ తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఖాళీ కడుపుతో మనం ఏది తిన్నా కూడా అది మన ఆరోగ్యం, ఫిట్ నెస్ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.


కాబట్టి మీరు  ఉదయం పూట ఎలాంటి ఆహారం తినాలి.. ఏ ఆహారం తినకూడదనే విషయాలను గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. మీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా , ఫిట్ గా ఉంచుకోవాలంటే తప్పకుండా పక్కా డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి. అంతే కాకుండా కొన్ని రకాల టిప్స్ కూడా అనుసరించాలి.మరి వీటి గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గోరు వెచ్చటి నీరు:
గోరు వెచ్చటి నీరు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అంతే కాకుండా ఇది జీవక్రియను బలోపేతం చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఒకటి లేదా రెండు గ్లాసుల గోరు వెచ్చటి నీరు తాగడం చాలా మంచిది. ఇందులో నిమ్మరసం, తేనె కలిపి తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది.


డీటాక్స్ వాటర్:
ప్రతి రోజు ఉదయం పూట డీటాక్స్ వాటర్ తాగడం వల్ల హైడ్రేషన్ పెరుగుతుంది. అంతే కాకుండా బరువు కూడా తగ్గుతుంది. చర్మం కూడా కాంతివంతంగా మెరుస్తుంది. డీటాక్స్ వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అంతే కాకుండా శరీరం నుండి వ్యర్థ పదార్థాలు కూడా తొలగించబడతాయి.

బాదం, వాల్ నట్స్ :
ఉదయం పూట నానబెట్టిన నట్స్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా నానబెట్టిన బాదం, వాల్ నట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. వీటిలో విటమిన్ ఇ, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి, బాదం, వాల్ నట్స్ లో ఉండే పోషకాలు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా వీటిలో ఉండే పొటాషియం, కాల్షియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

Also Read: చిటికెడు కాఫీ పొడితో.. క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారిపోతుంది !

తాజా పండ్లు:
ఉదయం పూట తాజా పండ్లు తినడం వల్ల మనకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు , సహజ చక్కెరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది మీ శరీరానికి అవసరం అయిన శక్తిని అందిస్తుంది. బొప్పాయి, ఆపిల్ , అరటి, బెరీ, జామ, కివీ, దానిమ్మ, పుచ్చకాయ వంటి పండ్లను ఉదయం పూట ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. అంతే కాకుండా వీటి నుండి శరీరానికి ఎక్కువగా పోషకాలు లభిస్తాయి. బరువు కూడా అదుపులో ఉంటుంది. అంతే కాకుండా సమ్మర్ లో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము. అరటిపండులో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×