BigTV English

Ss Rajamouli: ఆ సినిమా చూసిన తర్వాత నేను రాస్తున్న పుస్తకం చింపేశాను

Ss Rajamouli: ఆ సినిమా చూసిన తర్వాత నేను రాస్తున్న పుస్తకం చింపేశాను

Ss Rajamouli: కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక డిజాస్టర్ కూడా తీయని డైరెక్టర్ అంటే అందరికీ టక్కున గుర్తు చెప్పారు ఎస్ఎస్ రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా కెరియర్ మొదలుపెట్టిన రాజమౌళి అంచలంచలుగా ఒక్కొక్క హిట్ సినిమా చేసుకొని తాను ఎదగడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచారు. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా కోసం ఎదురుచూసే ఆడియన్స్ కూడా మొదలయ్యారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరియర్ లో రాబోతున్న 29వ సినిమా అది. ఆ సినిమా మీద విపరీతమైన భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలో ఇవ్వనున్నారు.


పుస్తకం చింపేశాను

ఒక సక్సెస్ఫుల్ సినిమాను ఎలా తీయాలి అని ఒక ఆలోచనతో పుస్తకం రాయడం మొదలుపెట్టారట ఎస్ ఎస్ రాజమౌళి. అయితే పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బిజినెస్ మెన్ సినిమా తర్వాత ఆ పుస్తకాన్ని ఎస్ఎస్ రాజమౌళి చింపేశారట. వాస్తవానికి ఒక సక్సెస్ఫుల్ సినిమాను ఎలా తీయాలి అనే రాసే స్థాయి అర్హత అన్ని అంశాలు కూడా ఎస్.ఎస్.రాజమౌళి లో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు రాజమౌళి తీసిన ప్రతి సినిమా కూడా సక్సెస్ అయింది. కానీ పుస్తకం చింపడానికి అసలు కారణం ఏంటి అంటే, హీరో క్యారెక్టర్ నెగిటివ్ గా ఉంటుంది. అలానే హీరో బూతులు మాట్లాడుతూ ఉంటాడు. కానీ సినిమా మొత్తం ఒక్క మహేష్ బాబు లాక్కొని వెళ్లిపోయాడు. అటువంటి సినిమా హిట్ అవడం కూడా ఎస్.ఎస్ రాజమౌళిని ఆశ్చర్యపరిచింది. అందుకే బిజినెస్ మెన్ సినిమా తర్వాత ఎస్.ఎస్ రాజమౌళి తాను రాస్తున్న పుస్తకాన్ని చింపేశారట.


పూరి జగన్నాథ్ దగ్గర పని చేయాలి

మహేష్ బాబు నటించిన బిజినెస్ మెన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కి ఎస్ ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే అప్పుడు పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుతూ మంచి ప్రశంసలు చేశారు. మేము సంవత్సరం అంతా కష్టపడి ఒక సినిమా చూస్తుంటే పూరి జగన్నాథ్ వచ్చి ఒక్క డైలాగ్ తో అంతా కొట్టుకెళ్లిపోతాడు. పూరి లాంటి దర్శకుడు దగ్గర అవకాశం ఇస్తే నాకు కొన్ని రోజులు పనిచేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఒక క్యారక్టరైజేషన్ తో సినిమాను నడపడంలో పూరి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అని రీసెంట్ టైమ్స్ లో పూరి జగన్నాథ్ ఒక సక్సెస్ఫుల్ సినిమా చూసి చాలా సంవత్సరాలు అయింది. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ చేయబోయే సినిమా గురించి మంచి అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాతో అయినా పూరి సక్సెస్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.

Also Read : Harsha Vardhan: వర్మనే డామినేట్ చేస్తున్న హర్ష.. కాస్త ఆలోచించు గురూ..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×