Dark Circles: ఈ రోజుల్లో డార్క్ సర్కిల్స్ సాధారణ సమస్యగా మారింది. తక్కువ నిద్ర, ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం, కంప్యూటర్‌పై ఎక్కువ సమయం గడపడం. హైడ్రేషన్ లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు కావచ్చు. ఇదిలా ఉంటే డార్క్ సర్కిల్స్ ముఖ సౌందర్యాన్ని పాడు చేయడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తాయి. అందుకే ఈ సమస్య నుండి బయటపడటానికి కొన్ని సింపుల్ హోం రెమెడీస్ పాటించడం చాలా ముఖ్యం. హోం రెమెడీస్ డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఎలాంటి హోం రెమెడీస్ కళ్ల క్రింద ఉన్న హోం రెమెడీస్ తగ్గిస్తాయి. వీటిని ఎలా తయారు చేసుకుని ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటో, నిమ్మరసం:
టమాటోలలో ఉండే లైకోపీన్ డార్క్ సర్కిల్స్ తేలికపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా నిమ్మరసం బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించడానికి ఒక పాత్రలో 1 టీస్పూన్ టమాటోరసంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి కళ్ళ కింద అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోండి. మీరు దీన్ని వారానికి 3 నుండి 4 సార్లు కూడా ఉపయోగించవచ్చు. ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
దోసకాయ:
దోసకాయను సన్నని ముక్కలుగా కట్ చేసి, 10 నుండి 15 నిమిషాలు చల్లబరచడానికి ఫ్రిజ్‌లో ఉంచండి. తరువాత చల్లని దోసకాయ ముక్కలను కళ్ళపై 15 నిమిషాలు ఉంచండి. దీన్ని ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల మీరు తక్కువ సమయంలోనే డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవచ్చు. దోసకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు డార్క్ సర్కిల్స్ తగ్గిస్తాయి. అంతే కాకుండా చర్మాన్ని కాంతివంతగా కూడా మారుస్తాయి.
రోజ్ వాటర్ :
రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం దూదిని రోజ్ వాటర్‌లో ముంచి కళ్ళపై 10 నుండి 15 నిమిషాలు ఉంచండి. ప్రతి రాత్రి పడుకునే ముందు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో కూడా రోజ్ వాటర్ ప్రభావవంతంగా పని చేస్తుంది.
బాదం నూనె , తేనె:
బాదం నూనెలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మానికి పోషణనిస్తుంది. అంతే కాకుండా డార్క్ సర్కిల్స్ తొలగిస్తుంది. దీనిని ఉపయోగించడానికి, ఒక గిన్నెలో 1 నుండి 2 చుక్కల బాదం నూనెను కొద్దిగా తేనెతో కలపండి. తరువాత కళ్ళ కింద తేలికగా మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం నిద్రలేచిన తర్వాత మీ ముఖాన్ని నీటితో కడుక్కోండి.
Also Read: విపరీతంగా జుట్టు రాలుతోందా ? ఈ టిప్స్ మీ కోసమే !
పాలు , పసుపు:
డార్క్ సర్కిల్స్‌ను వదిలించుకోవడానికి పాలు,పసుపు కూడా ఉత్తమమైన , సులభమైన మార్గం. దీని కోసం 1 చెంచా పాలలో చిటికెడు పసుపు కలపండి. దీన్ని కళ్ళ కింద అప్లై చేసి 10 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అంతే కాకుండా పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.