Naga Chaitanya – Samantha: నాగచైతన్య, సమంత విడాకులు అనేవి ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వీరి ప్రేమ, పెళ్లి గురించి ఎంతమంది ప్రేక్షకులు మాట్లాడుకున్నారో.. అంతకంటే ఎక్కువమంది వారి విడాకుల గురించి మాట్లాడుకున్నారు. నాగచైతన్య.. ఆ విడాకుల నుండి బయటికి వచ్చి శోభితాను పెళ్లి చేసుకున్నా కూడా ఇంకా సమంత గురించే మాట్లాడుతున్నారు ప్రేక్షకులు. దీనిపై నాగచైతన్య గానీ, సమంత గానీ పూర్తిస్థాయిలో స్పందించలేదు. ‘తండేల్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న చైతూ మొదటిసారి ఈ విషయంపై మాట్లాడాడు. విడాకుల గురించి, రెండో పెళ్లి గురించి నాగచైతన్య ఇంత స్పష్టంగా మాట్లాడడం ఇదే మొదటిసారి.
కలిసే ప్రకటించాం
నాగచైతన్య, సమంత (Samantha) కలిసే విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చాడు చైతూ. అయినా కూడా చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారని వాపోయాడు. ‘‘సమంతతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ షేర్ చేసినా నెగిటివ్ కామెంట్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పటికీ ఆ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అన్నింటిని చదువుతాను. విడాకుల విషయాన్ని సమంత, నేను కలిసే ప్రకటించాం. వ్యక్తిగత కారణాల వల్ల ఆ నిర్ణయం తీసుకున్నాం. ఎవరి దారి వారు చూసుకున్నాం. ఇది మా వ్యక్తిగత విషయమని, ప్రైవసీ ఇవ్వమని రిక్వెస్ట్ చేసినా కూడా దీనిని ఒక ఎంటర్‌టైన్మెంట్ లాగా చూస్తున్నారు’’ అంటూ ఒకేసారి తన మనసులోని మాటలు అన్నీ బయటపెట్టేశాడు నాగచైతన్య.
క్రిమినల్ కాదు
‘‘విడాకులపై ఎన్నో వార్తలు, రూమర్స్ వచ్చాయి. అప్పుడే నేను అందరి ముందుకు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే మాట్లాడలేదు. అప్పటికీ కొన్ని ఈవెంట్స్‌లో విడాకుల గురించి అడిగారు. అడగొద్దని, దాని గురించి మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేసినా వినలేదు. మళ్లీ మళ్లీ అదే గాయాన్ని గెలుకుతున్నారు. మా నిర్ణయాన్ని ఎవరూ గౌరవించలేదు. ఇప్పటికీ మా విడాకుల వార్తలకు, కామెంట్స్‌కు ఎవరూ ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. ఇకనైనా ఆపండి. విడాకులు తీసుకున్నందుకు నేనేం క్రిమినల్ కాదు. నేను కూడా విడాకుల తీసుకున్న కుటుంబం నుండే వచ్చాను. అందుకే ఇద్దరం ఎన్నోసార్లు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాత్రికి రాత్రి తీసుకున్నది కాదు. దీని గురించి చాలారోజుల పాట్లు చర్చలు జరిగాయి’’ అని చెప్పుకొచ్చాడు నాగచైతన్య.
Also Read: స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకోలేకపోయిన నమత్ర సోదరి.. ఇన్ని కష్టాలు పడినా ఫలితం లేదా.?
తప్పుగా మాట్లాడకండి
సమంతతో విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత మరొక నటి అయిన శోభితాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగచైతన్య (Naga Chaitanya). ‘‘శోభితా చాలా నేచురల్‌గా నా జీవితంలోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇద్దరం పరిచయం అయ్యాం. అలా మా ప్రయాణం మొదలయ్యింది. అలాంటిది శోభితా గురించి కూడా తప్పుగా మాట్టాడడం కరెక్ట్ కాదు. నా వ్యక్తిగత జీవితం గురించి తను చాలా బాగా ఆలోచిస్తుంది. ప్రస్తుతం నా లైఫ్‌లో నిజమైన హీరో శోభితానే’’ అంటూ శోభితా (Sobhita)పై తనకు ఉన్న ప్రేమను బయపెట్టాడు నాగచైతన్య. మొత్తానికి సమంతతో విడాకులపై మొదటిసారి చైతూ ఇలా ఓపెన్‌గా మాట్లాడడంతో ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.