Dark Spots On Face: మహిళల్లో చాలా మంది మొటిమలు, నల్ల మచ్చల వంటి చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. కొందమందిలో నలుపు, గోదుమ రంగు మచ్చలు ముఖంపై ఎక్కువగా వస్తుంటాయి . వయస్సు పెరిగే కొద్దీ చర్మ సమస్యలు రావడం కామన్ అయినప్పటికీ.. ముఖంపై ఉన్న మచ్చలు మీ వ్యక్తిత్వాన్ని పాడు చేస్తాయి. వీటిని మేకప్ లేదా ఖరీదైన క్రీముల సహాయంతో కొంతకాలం దాచవచ్చు. కానీ మీరు ఈ నల్లటి మచ్చలను శాశ్వతంగా వదిలించుకోవాలనుకుంటే.. మాత్రం అమ్మమ్మల కాలం నాటి కొన్ని చిట్కాలను పాటించాలి.
శనగ పిండి మాస్క్:
శనగ పిండి మాస్క్ మీ చర్మాన్ని మెరుగుపరచడంలో అలాగే మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చాలా ప్రభావవంతమైనది. శనగ పిండిని ఉపయోగించి ముఖాన్ని మచ్చ లేకుండా చేసుకోవచ్చు. శనగపప్పులో ఉండే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి , చర్మ ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీంతో ఫేస్ మాస్క్ తయారు చేయడానికి.. మీరు ఒక గిన్నెలో 3 చెంచాల శనగ పిండి తీసుకుని అందులో రెండు చెంచాల నిమ్మరసం తీసుకోవాలి. ఈ పదార్థాలను బాగా కలిపి పేస్ట్ తయారు చేయండి. తర్వాత ఈ పేస్ట్‌ని ముఖం మీద అప్లై చేసి దాదాపు 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఈ మాస్క్ మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ముఖానికి సహజ కాంతిని అందిస్తుంది.
బంగాళదుంప రసం:
బంగాళదుంపలో బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి. కాబట్టి ఇది చర్మం యొక్క రంగును మెరుగుపరచడంతో పాటు, నల్లటి మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బంగాళదుంప రసం సూర్యరశ్మి వల్ల కలిగే నల్ల మచ్చలు, మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ముఖాన్ని మెరిసేలా తయారు చేస్తుంది. బంగాళదుంపను ముఖానికి ఎలా వాడాలంటే.. ఒక గిన్నెలో బంగాళదుంప రసం, పెరుగును సమాన పరిమాణంలో తీసుకొని దానికి నిమ్మరసం కలపండి. ఈ మాస్క్‌ని ముఖం మీద దాదాపు 20 నిమిషాలు అప్లై చేసి ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో వాష్ చేయండి.
బియ్యం పిండి:
బియ్యం పిండిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం ద్వారా నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా బియ్యం పిండిని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా.. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. బియ్యం పిండితో మాస్క్ తయారు చేయడానికి.. రెండు చెంచాల బియ్యం పిండి, ఒక చెంచా క్రీమ్ ,ఒక చెంచా నిమ్మరసం కలిపి మెత్తని పేస్ట్ లా చేయాలి. తర్వాత ఈ మాస్క్‌ని ముఖం మీద 20 నిమిషాలు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికి రెండుసార్లు అప్లై చేయండి.
Also Read: విటమిన్ ఇ క్యాప్సూల్స్‌తో.. మెరిసే చర్మం మీ సొంతం
మజ్జిగ క్లెన్సర్:
చర్మంపై నుండి మృతకణాలు, మురికిని తొలగించడానికి మజ్జిగను క్లెన్సర్‌గా ఉపయోగించవచ్చు. మజ్జిగలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంలో , మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక చెంచా నిమ్మరసం, 4 చెంచాల మజ్జిగలో కలిపి, దూదితో ముఖంపై 20 నిమిషాలు అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో వాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు పూర్తిగా తొలగిపోతాయ్ .