Arjun S/o Vyjayanthi Collections :వెండితెర రాములమ్మగా, లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి (vijayashanti) చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై దర్శనం ఇచ్చింది. మహేష్ బాబు (Maheshbabu) నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు కళ్యాణ్ రామ్ (Kalyan Ram) మూవీలో నటించింది. కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. విజయశాంతి కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రాలలో ‘కర్తవ్యం’ సినిమా ఒకటి. ఈ సినిమాతో ఈమె ఇమేజ్ హీరో లెవెల్ లో పెరిగిపోయింది. పైగా ఈ సినిమా కోసం కోటి రూపాయలు రెమ్యూనరేషన్ కూడా అందుకుంది. అంతే కాదండోయ్ ఆ కాలంలోనే హీరోలకు దీటుగా పారితోషకం తీసుకున్న ఏకైక హీరోయిన్ గా కూడా రికార్డు సృష్టించింది విజయశాంతి. కర్తవ్యం సినిమాలో లేడీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఆ పోలీస్ ఆఫీసర్ కి కొడుకు పుడితే..? అతడు క్రిమినల్ అయితే..? ఆ తర్వాత ఏం జరిగింది..? అనే విషయాలకు కొనసాగింపుగా ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీని తెరకెక్కించారు.
మొదటిరోజు కలెక్షన్స్ రూ.5.15 కోట్లు.. అసలు వచ్చిందెంతో తెలుసా..?
మాస్, యాక్షన్ తోపాటు తల్లి కొడుకుల సెంటిమెంటుతో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య సినిమా విడుదల అయ్యింది. కానీ ఈ సినిమాలో కొత్తగా ఏం లేదనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా యాక్షన్ ఘట్టాలు , సెంటిమెంట్ సన్నివేశాలు సినిమాకి హైలెట్ నిలిచినా.. కొత్తరకం సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులను ఈ సినిమా అంతగా మెప్పించలేదు. ముఖ్యంగా మాస్ సినిమాలను ఇష్టపడే అభిమానులకి మాత్రం ఈ సినిమా పైసా వసూలు అని చెప్పవచ్చు. కాకపోతే కథనం, రొటీన్ టెంప్లేట్ తో సాగడమే చాలా మైనస్ గా మారిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లను కూడా పెద్దగా రాబట్టలేకపోయింది. కానీ చిత్ర బృందం మాత్రం రూ.5.15 కోట్లు వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.అయితే అసలు ఈ సినిమాకి వచ్చింది ఎంతో తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి రోజు ఈ సినిమాకు కేవలం రూ.3.8కోట్లు వచ్చినట్లు సమాచారం.
ఈ రెండు రోజుల్లో కలెక్షన్స్ పెరిగేనా..?
ముఖ్యంగా ఈ సినిమా పెద్దగా ఎక్కడ ఆకట్టుకోలేదు. దీనికి తోడు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాపై ఎలాంటి ప్రభావం లేకపోవడం ఆశ్చర్యకరం. ఇందులో మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చే సినిమా కాబట్టి.. కొంచెం పాజిటివ్ టాక్ రావడం వల్ల ఈ శని, ఆదివారాలలో సినిమా కలెక్షన్స్ విషయంలో ఏవైనా కదలికలు వస్తాయేమో చూడాలి. నిజానికి ఇప్పటివరకు అయితే కమర్షియల్ గా ఈ సినిమాపై నెగెటివ్ టాక్ ఉందని చెప్పవచ్చు. అటు కలెక్షన్లు రాకపోయినా కమర్షియల్ హిట్ అని మేకర్స్ పోస్టర్ వేయడంతో అటు సినిమా లవర్స్ కూడా పక్కున నవ్వుతున్నారు.
Thug Life OTT: కళ్లు చెదిరే భారీ ధరకు ఓటీటీ డీల్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..?
అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ నటీనటులు..
ఇంకా ఈ సినిమా నటీనటుల విషయానికే వస్తే.. నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహెల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా.. రాంప్రసాద్ సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోకవర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఏది ఏమైనా ఈ రెండు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు పెరుగుతాయేమో చూడాలి.
A blockbuster beginning at the box office ❤🔥#ArjunSonOfVyjayanthi collects 5.15 CRORES GROSS WORLDWIDE on Day 1 💥💥
Watch the EMOTIONAL BLOCKBUSTER in theatres near you ❤️ #KalyanRam #VijayaShanthi #ArjunSonOfVyjayanthi #BIGTVCinema@NANDAMURIKALYAN@vijayashanthi_m pic.twitter.com/Wkr7GvZddu
— BIG TV Cinema (@BigtvCinema) April 19, 2025