BigTV English

Face Pack:ఫేస్ క్రీములు అవసరమే లేదు, వీటితో.. గ్లోయింగ్ స్కిన్

Face Pack:ఫేస్ క్రీములు అవసరమే లేదు, వీటితో.. గ్లోయింగ్ స్కిన్

Face Pack: వేసవి ప్రారంభం కాగానే చర్మంలో పొడిబారడం మొదలవుతుంది. చర్మంలోని తేమ కోల్పోయినప్పుడు అది పొడిగా మారడం సర్వసాధారణం. విపరీతమైన వేడి కారణంగా.. చర్మంపై ఎరుపు ట్యానింగ్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. కొన్ని హోం రెమెడీస్ ఇందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మృదుత్వం కూడా తొలగిపోతుంది.


చాలా మంది మార్కెట్ నుండి ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొని వాడతారు. కానీ ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో.. మీరు ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు.

సమ్మర్ ఫేస్ ప్యాక్స్:


టమాటో, పెరుగు ఫేస్ ప్యాక్:
టమాటోలో సహజ బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి. పెరుగు కూడా చర్మాన్ని చల్లబరుస్తుంది. ఈ రెండింటినీ కలిపి అప్లై చేయడం వల్ల ట్యానింగ్ సమస్య తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ఒక చెంచా టమాటో రసం, ఒక చెంచా పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనిని వారానికి 2-3 సార్లు చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

రోజ్ వాటర్ , అలోవెరా జెల్:
రోజ్ వాటర్ చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా రిఫ్రెష్ చేస్తుంది. అయితే అలోవెరా జెల్ చర్మాన్ని రిపేర్ చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి పడుకునే ముందు ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అంతే కాకుండా మొటిమలు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. సమ్మర్ వేడి, హానికరమైన ప్రభావాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

దోసకాయ రసం:
వేసవిలో చర్మాన్ని చల్లబరచడానికి దోసకాయ ఉత్తమ మార్గం. దోసకాయ రసం తీసి.. దూది సహాయంతో దానిని ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది చికాకు, వాపును తగ్గించడమే కాకుండా, నల్లటి వలయాలు, టానింగ్‌ను క్రమంగా తగ్గిస్తుంది. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

శనగపిండి, పసుపు ప్యాక్:
శనగపిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా పసుపులో క్రిమినాశక లక్షణాలు పుష్కలంగా కూడా ఉంటాయి. రెండింటినీ కలిపి ముఖంపై అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మెరుస్తుంది. ఒక చెంచా శనగపిండి, చిటికెడు పసుపు, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చేతులతో సున్నితంగా రుద్దుతూ కడిగేయండి.

బంగాళదుంప రసం:
బంగాళదుంపలలో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి సన్‌టాన్ , నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. బంగాళదుంపను తురుము, దాని రసం తీసి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేయండి. వారానికి రెండుసార్లు దీనిని ఉపయోగించడం వల్ల చర్మం శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

Also Read: సమ్మర్‌లో చర్మంపై కొబ్బరి నూనె అప్లై చేస్తే.. ?

నిమ్మకాయ, తేనె మిశ్రమం:
నిమ్మకాయ చర్మంలోని మురికిని తొలగిస్తుంది. అంతే కాకుండా తేనె చర్మాన్ని తేమగా చేస్తుంది. రెండింటి కలయిక చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా టాన్ ను తగ్గిస్తుంది. ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఎండలో బయటకు వెళ్ళే ముందు ఈ రెమెడీని ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×