BigTV English

TDP vs YSRCP : ఆ మంత్రితో రోజా సీక్రెట్ మీటింగ్? జగన్‌కు హ్యాండ్?

TDP vs YSRCP : ఆ మంత్రితో రోజా సీక్రెట్ మీటింగ్? జగన్‌కు హ్యాండ్?

TDP vs YSRCP : ఆర్కే రోజా. మాజీ మంత్రి. వైసీపీ మౌత్ ఫీస్. పాలిటిక్స్‌లోనూ ఖబర్దస్త్ కామెడీ చేస్తుంటారు. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయమంతా రోజా చుట్టూనే తిరిగింది. అసెంబ్లీలోనూ ఓవరాక్షన్ చేశారు. ఆనాటి స్పీకర్ కోడల.. ఆమెను ఏడాదికిపైగా సభ నుంచి సస్పెండ్ చేశారు. ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఆ రోజుల్లో ఓ వెలుగు వెలిగారు. కానీ, ఈసారి మాత్రం సీన్ మారింది. దారుణ పరాజయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. మీడియా ముందుకూ రావట్లేదు. ఆమెను టన్నుల్లో భయం వెంటాడుతోందని అంటున్నారు. అందుకే సైలెన్స్ ఈజ్ సో బెటర్ పాలసీ ఫాలో అవుతున్నారు. ఇంతకీ రోజాకు ఎందుకంత భయం? రెడ్ బుక్ ఎఫెక్టా? ఆడుదాం ఆంధ్ర దోపిడీయా?


ఆ మంత్రితో రోజాకు ఏం పని?

అరెస్టుల లిస్టులో బోరుగడ్డ, పోసాని, వల్లభనేనిల తర్వాత.. పెద్దిరెడ్డి, కొడాలి, పేర్ని, అంబటి, రోజాల పేర్లే వినిపిస్తున్నాయి. కొడాలి హాస్పిటల్‌లో ఉండటంతో ప్రస్తుతానికి కాస్త రిలాక్స్. పేర్నికి ఆల్రెడీ ఉచ్చు బిగిసింది. పెద్దిరెడ్డి, అంబటి, రోజాల కోసం వేట మొదలైంది. ఇదే ఇప్పుడు రోజమ్మను టెన్షన్‌కు గురి చేస్తోందని అంటున్నారు. తన అరెస్ట్ పక్కా అని ఫిక్స్ అవడంతో.. ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీలో ఉన్న పాత పరిచయాలను కొత్తగా వాడేసుకుంటున్నారట. చంద్రబాబు కేబినెట్‌లో కీలక పోస్టులో ఉన్న ఓ మంత్రితో ఇటీవల రోజా రహస్యంగా సమావేశమయ్యారని తెలుస్తోంది. రాయలసీమకు చెందిన ఆ మంత్రిని రోజా విజయవాడలో కలిశారట. ఇదే అంశం ఇప్పుడు ఇటు టీడీపీలో, అటు వైసీపీలో కలకలం రేపుతోంది.


సీక్రెట్ మీటింగ్ అందుకేనా?

రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర పేరుతో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్రపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని మంత్రి రాంప్రసాద్‌ ప్రకటించారు. పక్కా ఆధారాలు ఉన్నాయని రేపో, మాపో ఆర్కే రోజా అరెస్ట్ అంటూ ప్రచారమూ జరుగుతోంది. ఇలాంటి టైమ్‌లో ఓ మంత్రితో రోజా సీక్రెట్ మీటింగ్ అందుకోసమేనా? విచారణ నుంచి తప్పించుకోవడానికేనా? ఆ మంత్రితో లాబీయింగ్ చేస్తున్నారా? అందుకు చంద్రబాబు, లోకేశ్‌లు ఒప్పుకుంటారా?

రోజాతో రాజీ అంత ఈజీనా?

లోకేశ్‌ రెడ్‌బుక్‌ టాప్‌లిస్ట్‌లో ఉన్న రోజాను.. ఆ మంత్రి ఎందుకు కలిశారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్‌, పవన్‌లపై రోజా చేసిన కామెంట్స్ గుర్తులేవా? అప్పుడే మర్చిపోయారా? ఆమెతో భేటీ కావాల్సిన అవసరం ఏముంది? అంటూ మండిపడుతున్నారు. మేటర్ చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లిందని.. ఆయన సైతం వాళ్ల భేటీపై సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆ మంత్రిని పిలిపించి మందలించే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు.

Also Read : పవన్‌పై బొత్సకు ఎందుకంత ప్రేమ? ఆ లాజిక్ తెలిస్తే…

జగన్‌కు రోజా హ్యాండ్ ఇచ్చేనా?

టీడీపీలోనే కాదు.. అటు వైసీపీ నేతలు కూడా రోజా తీరుపై ఫైర్ అవుతున్నారు. ఓ వైపు అధికార పార్టీపై తమ అధినేత తీవ్రంగా పోరాడుతుంటే.. ఆ మంత్రితో రోజా రహస్య సమావేశాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మిగతా మాజీ మంత్రులు తమపై నమోదవుతున్న కేసులపై పోరాడుతుంటే.. రోజా మాత్రం ఇలా సరెండర్ కావడం పార్టీకి తలవొంపులని మండిపడుతున్నారు. ఎవరు ఏమనుకుంటున్నా.. రోజా మాత్రం కేసుల నుంచి ఎలాగైనా బయటపడాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అక్రమ కేసులకు భయపడబోమని ప్రెస్‌మీట్‌లలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే… మరోవైపు తన రాజకీయ అనుభవమంతా ఉపయోగించి.. రహస్య మంత్రాంగంతో ఎలాగైనా చిక్కుల్లో చిక్కుకోకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×