1. తేనె: తేనెలో యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలను నివారించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇది చర్మాన్ని తేమగా ఉంచుతూనే, అధికంగా నూనెను పీల్చుకుంటుంది.
ఉపయోగించే విధానం: స్వచ్ఛమైన తేనెను ముఖానికి రాసి 15-20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇది చర్మాన్ని మెత్తగా, జిడ్డు లేకుండా చేస్తుంది.
2. ఓట్స్ : ఓట్స్ చర్మంలోని అదనపు నూనెను, మృతకణాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది ఒక అద్భుతమైన ఎక్స్‌ఫోలియంట్‌గా పనిచేస్తుంది.
ఉపయోగించే విధానం: 2 చెంచాల ఓట్స్‌ను కొద్దిగా నీటితో కలిపి పేస్ట్ లాగా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, సున్నితంగా మసాజ్ చేయండి. 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.
3. నిమ్మరసం : నిమ్మ రసంలో ఉండే సైట్రిక్ యాసిడ్ చర్మంలోని నూనెను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఉపయోగించే విధానం: ఒక చెంచా నిమ్మ రసాన్ని ఒక చెంచా నీటితో కలిపి, దూదితో ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.
4. ముల్తానీ మట్టి : ముల్తానీ మట్టి జిడ్డు చర్మానికి దివ్య ఔషధం. ఇది చర్మం నుంచి అదనపు నూనెను, మలినాలను పీల్చుకుంటుంది. తద్వారా ముఖ రంధ్రాలను శుభ్రపరుస్తుంది.
ఉపయోగించే విధానం: 2 చెంచాల ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ లేదా నీరు కలిపి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసి ఆరనివ్వండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.
5. అలోవెరా : అలోవెరాలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని శాంతపరుస్తుంది. అంతే కాకుండా నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది.
ఉపయోగించే విధానం: స్వచ్ఛమైన అలోవెరా జెల్‌ను ముఖానికి రాసి, రాత్రంతా ఉంచి ఉదయం కడిగేయండి. లేదా 20 నిమిషాలు ఉంచి కడిగేయండి.
6. దోసకాయ : దోసకాయలో ఆస్ట్రింజెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మంలోని రంధ్రాలను కుదించి, నూనె ఉత్పత్తిని తగ్గిస్తాయి. అంతే కాకుండా ముఖాన్ని కూడా మెరిసేలా చేస్తాయి.
ఉపయోగించే విధానం: దోసకాయ ముక్కలను ముఖంపై రుద్దండి లేదా దోస కాయ రసాన్ని ముఖానికి రాసి 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత కడిగేయండి.
7. గుడ్డు తెల్లసొన : గుడ్డు తెల్లసొన చర్మ రంధ్రాలను బిగించి, అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది. అందుకే వీటిని వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
ఉపయోగించే విధానం: ఒక గుడ్డు తెల్ల సొనను బాగా గిలకొట్టి, ముఖానికి రాసి 15 నిమిషాలు ఆరనివ్వండి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసిస్తున్నారు.