Viral Video: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక ప్రయాణికుడు గందరగోళం సృష్టించాడు. ఫోన్ ఛార్జర్ కనిపించకపోవడంతో డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశాడు. చివరకు సిబ్బందిని బెదిరించే పని చేశాడు.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణిస్తున్న నానాహంగామా చేశాడు. ఫోన్ ఛార్జర్ పొగొట్టుకుని లోపల గందరగోళం సృష్టించాడు. దీనికి సంబంధించి వీడియో నెట్టింట్లో హంగామా చేస్తోంది. ఓ ప్రయాణికుడు ఈ తతంగాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.
షార్లెట్ నుండి విమానం బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందు ఈ తతంగం జరిగింది. లోపల అటు ఇటు నడుస్తూ గట్టిగా కేకలు పెట్టాడు. దాదాపు 15 నిమిషాల పాటు ఈ వ్యవహారం సాగింది. ప్రయాణికుడి చేష్టలతో మిగతావారు అసహనానికి గురయ్యారు. ఆ వ్యక్తి ఫోన్ ఛార్జర్ పొగొట్టుకోవడమే ఇందుకు కారణమైంది.
క్యాబిన్ సిబ్బందిపై ఓ రేంజ్‌లో చిందులేశాడు. డబ్బు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశాడు. తాను సైలెంట్‌గా ఉండాలంటే మద్యం కావాలని డిమాండ్ చేశాడు. ఒకానొక సమయంలో తన బ్యాక్ ప్యాక్ నుండి నారింజ రంగు ప్రిస్క్రిప్షన్ బాటిల్‌ను తీసి నోట్లో ఏదో పెట్టుకున్నాడు. ఫ్లోరిడా రాపర్ కోడాక్ బ్లాక్‌తో కలిసి పనిచేస్తున్నట్లు గొప్పలు చెప్పే ప్రయత్నం చేశాడు.
ALSO READ: మద్యం మత్తులో పాముని నమిలి మింగాడు, వైరల్ వీడియో
గంజాయి తాగుతానని బెదిరిస్తాడు కూడా. విమానంలో కెప్టెన్ పక్కన కాక్‌పిట్‌లో కూర్చోవడానికి అవకాశం ఇస్తే 100 డాలర్లు ఇస్తానని కేబిన్ సిబ్బందికి ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు మీరు ఎవరితో మాట్లాడాలని భావిస్తున్నారో తాను వారితో మాట్లాడతానని చెప్పే ప్రయత్నం చేశాడు. చివరకు యథావిధిగా అనుకున్న సమయానికి విమానం బయలుదేరింది.
చివరకు ప్రయాణికుడ్ని విమానం నుంచి దింపివేసినట్టు న్యూయార్క్ పోస్టు పత్రిక రాసుకొచ్చింది. కస్టమర్ల సహనానికి ధన్యవాదాలు తెలియజేసింది అమెరికన్ ఎయిర్‌లైన్స్. ఆ ప్రయాణికుడి కారణంగా కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది.
Kodak Black’s future client pic.twitter.com/WO6O9IDOS5
— John Armstrong (@msmcb02) July 16, 2025