BigTV English

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Tan Removal Tips : ముఖం తెల్లగా మెరిసిపోవాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయినప్పటికీ సూర్యరశ్మికి ఎక్కువగా గురైనప్పుడు చర్మంపై ట్యాన్ ఏర్పడుతుంది. ఇది చర్మం యొక్క పై పొరలో మెలనిన్ ఉత్పత్తి పెరగడం వల్ల వస్తుంది. టాన్ వల్ల చర్మం నిస్తేజంగా.. నల్లగా మారుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని రకాల సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖాన్ని కాంతివంతంగా మార్చడానికి ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ట్యాన్ తొలగించే చిట్కాలు:

1. నిమ్మరసం, తేనె, పాలు:
నిమ్మరసంలో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇవి టాన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. పాలు చర్మానికి తేమను అందిస్తాయి.


ఎలా వాడాలి ?
ఒక గిన్నెలో ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె, ఒక టేబుల్‌స్పూన్ పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని టాన్ ఉన్న చోట రాసి 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

2. శనగపిండి, పసుపు, పెరుగు:
శనగపిండి ఒక అద్భుతమైన ఎక్స్‌ఫోలియేటర్. ఇది చర్మంపై ఉండే మృత కణాలను తొలగిస్తుంది. పసుపులో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. పెరుగు చర్మాన్ని చల్లబరుస్తుంది.

ఎలా వాడాలి ?
ఒక టేబుల్‌స్పూన్ శనగపిండి, ఒక చిటికెడు పసుపు, సరిపడా పెరుగు కలిపి పేస్ట్ లా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను టాన్ ఉన్న ప్రదేశంలో రాసి ఆరిన తర్వాత రుద్దుతూ కడిగేయాలి.

3. టమాటో గుజ్జు, పెరుగు:
టమాటోలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుందిజ ఇది టాన్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఏం చేయాలి ?
ఒక టమోటాను మెత్తగా గుజ్జు చేసి, దానిలో రెండు టేబుల్‌స్పూన్ల పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని టాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడగాలి.

4. బంగాళదుంప జ్యూస్:
బంగాళదుంపలో ఉండే క్యాటెకోలాస్ అనే ఎంజైమ్ చర్మాన్ని తెల్లగా చేయడంలో సహాయపడుతుంది.

ఎలా వాడాలి ?
ఒక బంగాళదుంపను సగానికి కోసి, దానిని టాన్ ఉన్న చోట రుద్దాలి. లేదా, బంగాళదుంపను తురిమి రసం తీసి, ఆ రసాన్ని కాటన్ బాల్‌తో చర్మంపై రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

Also Read: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

5. అలోవెరా జెల్:
అలోవెరా చర్మాన్ని చల్లబరిచి, మంటను తగ్గిస్తుంది. ఇది టాన్ వల్ల దెబ్బతిన్న చర్మ కణాలను నయం చేయడానికి సహాయపడుతుంది.

ఎలా వాడాలి ?
రాత్రి పడుకునే ముందు టాన్ ఉన్న చోట స్వచ్ఛమైన అలోవెరా జెల్‌ను రాసి, ఉదయం కడిగేయాలి.

ఈ చిట్కాలను పాటించడంతో పాటు సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్ వాడటం, బయటకు వెళ్లినప్పుడు క్యాప్ ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. టాన్ తొలగించడానికి ఈ చిట్కాలు తక్షణ ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ క్రమం తప్పకుండా వాడితే మార్పును గమనించవచ్చు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×