BigTV English

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

Conistable Kanakam: వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సిరీస్ కానిస్టేబుల్ కనకం(Constable Kanakam). యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ నుంచి ట్రైలర్ విడుదల చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 14వ తేదీ నుంచి ఈటీవీ విన్(Etv Win) ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఈ సిరీస్ పై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేస్తుంది. మరి ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనే విషయానికి వస్తే…


అడవిలో క్రూరమైన మృగాలు..

అన్ని సినిమాలు వెబ్ సిరీస్ ల మాదిరి కాకుండా చాలా విభిన్నంగా ఒక జానపద పాట రూపంలో ఈ సిరీస్ లోని పాత్రలను పరిచయం చేస్తూ ఈ ట్రైలర్ మొదలవుతుంది. కాళ్లకు గజ్జలు కట్టి జానపద పాట రూపంలో “రేపల్లె గ్రామానికి ఉత్తరాన దట్టమైన చెట్లతో అడవి గుట్ట ఉంది అంటూ ఆ గ్రామాన్ని పరిచయం చేశారు. అలాగే ఆ అడవిలో క్రూరమైన మృగాలు ఉన్నాయి… ఏమున్నాయి రా అంటే సింహం ఉంది, చిరుత, నక్క మొసలి అన్నీ ఉన్నాయి అంటూ ఆ గ్రామంలోని పోలీస్ స్టేషన్లో మృగాల రూపంలో ఉన్న పోలీసుల పాత్రలను” పరిచయం చేశారు.


కానిస్టేబుల్ పాత్రలో వర్ష…

ఇలా మృగాలు ఉన్నచోటకు ఒక జింక వచ్చింది అంటూ హీరోయిన్ వర్ష బొల్లమ్మను(Varsha Bollamma) పరిచయం చేస్తారు. అయితే ఈమె ఆ స్టేషన్ కు కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ అని స్పష్టమవుతుంది. అయతే మృగాలు లాంటి మనుషుల మధ్య వర్ష ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది.. వాటిని ఎలా అధిగమించారో అనేది చాలా ఆసక్తికరంగా మారింది. “ఎన్ని చేసిన ఆ జింక కొంచెం కూడా బెదరలేదు.. ఎందుకంటే అది జింక కాదు” అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్లతో కానిస్టేబుల్ పాత్రలో వర్ష ఎలివేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా ఈ ట్రైలర్ మొదటి నచి చివరి వరకు ఎంతో ఆసక్తికరంగా ఉండటమే కాకుండా ఈ సిరీస్ పై మంచి అంచనాలను కూడా పెంచేసింది.

ఇక ఈ సిరీస్ కు ప్రశాంత్ కుమార్(Prashanth Kumar) దర్శకత్వం వహించారు. ఇందులో నటుడు రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, మేఘా లేక వంటి నటీ నటులు బాగమయ్యారు. ఇక ఈ సిరీస్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా ఇటీవల తమ సిరీస్ ను కాపీ కొట్టారు అంటూ కానిస్టేబుల్ కనుక సిరీస్ దర్శకుడు ప్రశాంత్ విరాట పాలెం సిరీస్ పై అలాగే ఈ సిరీస్ నిర్వహించిన జీ తెలుగు ఓటీటీ సంస్థ పై కాపీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా గత కొద్ది రోజుల క్రితం ఈ రెండు ఓటీటీ సమస్థల మధ్య పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. ఇక విరాటపాలెం సిరీస్ కూడా అచ్చం కానిస్టేబుల్ కనకం కథను పోలి ఉండడంతో ఈ వివాదం నెలకొంది. ఇకపోతే ఇటీవల నటి వర్ష తమ్ముడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి. ఇలా ఈ సినిమా నిరాశపరిచిన కానిస్టేబుల్ కనుక మాత్రం తనకు మంచి సక్సెస్ అందిస్తుందని తాజాగా ట్రైలర్ చూస్తేనే స్పష్టం అవుతుంది.

Also Read: Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×