Hair Fall: నేటి బిజీ లైఫ్‌లో ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఒత్తిడితో పాటు అనేక కారణాల వల్ల జుట్టు రాలడం పెరుగుతోంది. ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు విటమిన్లు, అత్యంత అవసరం. ఒత్తైన జుట్టు కోసం మీరు తప్పకుండా పోషకాహారం తీసుకోవాలి. మీ జుట్టు రాలకుండా ఉండటంతో పాటు బాగా పెరగాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి:
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఉసిరి జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. తరచుగా ఆహారంలో ఉసిరిని తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా జుట్టును బలంగా చేయడంతో పాటు పొడవుగా మార్చడానికి ఉసిరి మేలు చేస్తుంది. ఉసిరిలో ఉండే పోషకాలు తెల్ల జుట్టు సమస్యను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి మీరు ఉసిరి పొడితో పాటు రసం కూడా ఉపయోగించవచ్చు. ఉసిరిని జుట్టుకు ఇలా వాడటం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
మెంతులు:
మెంతులు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును బలంగా మారుస్తాయి. అంతే కాకుండా జుట్టును పొడవుగా పెరిగేందుకు ఉపయోగపడతాయి. మెంతులను తరచుగా జుట్టుకు ఉపయోగించడం వల్ల కూడా చుండ్రు సమస్యలు తగ్గుతాయి. తెల్ల జుట్టు సమస్యను తగ్గించడంలో కూడా మెంతులు ఉపయోగపడతాయి.
కరివేపాకు:
జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించేందుకు కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు లో బీటా కెరోటిన్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులొ ఉండే ప్రోటీనన్లు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. కరివేపాకు జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టును ఒత్తుగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. కరివేపాకులో అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది జుట్టు మూలాలను కూడా బలంగా చేస్తుంది. మీరు కరివేపాకును మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కరివేపాకులు కొబ్బరి నూనెలో వేసి మరిగించి కూడా మీరు జుట్టుకు ఉపయోగించవచ్చు. అంతే కాకుండా పేస్ట్ లాగా చేసి కూడా జుట్టుకు అప్లై చేయవచ్చు. ఇలా తరచుగా వాడటం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా పెరుగుదల కూడా మెరుగుపడుతుంది.
Also Read: ఈ ఫ్రూట్స్ తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు
అవిసె గింజలు:
అవిసె గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఒమేగా – 3 కొవ్వు ఆమ్లాలు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తాయి. జుట్టును కూడా బలంగా మారుస్తాయి. ప్రతి రోజు మీరు ఉదయం పూట అవిసె గింజలు తినడం అలవాటు చేసుకోండి. వీటిని స్మూతీల తయారీలో కూడా మీరు ఉపయోగించవచ్చు.
పాల ఉత్పత్తులు :
పాలలో ఉండే పోషకాలు కూడా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. అంతే కాకుండా వీటిలో ఉండే కాల్షియం, బయోటిన్ జుట్టు రాలకుండా నివారిస్తాయి. జుట్టు సంబంధిత సమస్యలు ఉన్న వారు ప్రతి రోజు పాలు, పాల పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది.