BigTV English
Advertisement

Chiranjeevi: చిరంజీవి చేతికి భారీ బాధ్యత.. నరేంద్ర మోడీ నమ్మకాన్ని నిలబెట్టడానికి ప్రయత్నాలు..

Chiranjeevi: చిరంజీవి చేతికి భారీ బాధ్యత.. నరేంద్ర మోడీ నమ్మకాన్ని నిలబెట్టడానికి ప్రయత్నాలు..

Chiranjeevi: అసలు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, అప్పుడు వారసులుగా వచ్చిన హీరోలకు గట్టి పోటీ ఇచ్చి, దాదాపు మూడు దశాబ్దాలు సాటిలేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. అందుకే ఆయన అభిమానుల దృష్టిలో మెగాస్టార్ అయ్యారు. హిట్స్ వచ్చినా, ఫ్లాప్స్ వచ్చినా, ఆఖరికి సినిమాలు మానేసినా కూడా చిరుకు అభిమానులు తగ్గలేదు. అందుకే ఇప్పటివరకు చిరంజీవికి ఎన్నో ఘనతలు దక్కాయి. ఆయన పేరుపై ఎన్నో రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ చేతికి పెద్ద బాధ్యతే వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ బాధ్యతను తనకు అందించడంతో అప్పుడే దీనిని నిలబెట్టుకోవడానికి కసరత్తులు మొదలుపెట్టారు చిరు.


మోడీ నిర్ణయం

రాజకీయంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అవేవి వర్కవుట్ అవ్వక సినిమాల వైపుకు తిరిగి వచ్చేశారు. కానీ పొలిటికల్ యాంగిల్‌లో పలుమార్లు పలు బాధ్యత ఉన్న స్థానాలను స్వీకరించి తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) కూడా తనపై ఉన్న నమ్మకంతో ఒక బాధ్యతను అప్పగించారు. ‘వేవ్స్’కు అడ్వైసరీ బోర్డ్ మెంబర్‌గా మెగాస్టార్‌ను ఎంపిక చేశారు నరేంద్ర మోడీ. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీని మరింత ముందుకు నడిపించాలని, వారిని ఎంకరేజ్ చేయాలని మోడీ డిసైడ్ అయ్యారు. దానికి చిరంజీవి సాయం తీసుకోనున్నారని తెలుస్తోంది.


బోర్డ్ మెంబర్

ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన సమ్మిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ డిసైడ్ అయ్యారు. అదే ‘వేవ్స్’. ఈ వేవ్స్ సమ్మిట్‌కు చిరంజీవి అడ్వైసరీ బోర్డ్ మెంబర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని మెగాస్టార్ స్వయంగా ట్వీట్ చేసి మరీ ప్రకటించారు. ‘ఈ గౌరవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి థాంక్యూ. వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్మెంట్ సమ్మిట్)కు అడ్వైసరీ బోర్డ్‌గా ఉండడం గర్వంగా భావిస్తున్నాను. ఇతర సభ్యులతో కలిసి పనిచేస్తూ నా ఆలోచనలు కూడా పంచుకోవడం సంతోషంగా అనిపిస్తోంది. వేవ్స్ అనేది నరేంద్ర మోడీ ఆలోచన’ అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి.

Also Read: స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకోలేకపోయిన నమత్ర సోదరి.. ఇన్ని కష్టాలు పడినా ఫలితం లేదా.?

అది డౌట్ లేదు

‘వేవ్స్ అనేది ఇండియా యొక్క సాఫ్ట్ పవర్‌గా మారుతుందని, ప్రపంచ అంచులకు చేరుతుందని చెప్పడంలో నాకు డౌట్ లేదు. చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. కొత్త దారుల్లో వెళ్లడానికి సంతోషంగా ఉంది’ అంటూ తన సంతోషం మొత్తం ఈ పోస్ట్ ద్వారా బయటపెట్టారు చిరంజీవి. నరేంద్ర మోడీ తనను నమ్మి అంత పెద్ద బాధ్యతను ఇచ్చినందుకు చిరంజీవి కచ్చితంగా దానిని నిలబెట్టుకుంటారని తన ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న ‘విశ్వంభర’ (Vishwambhara) అనే మూవీతో బిజీగా ఉన్నారు చిరు. దాని తర్వాత మరొక ప్రాజెక్ట్‌కు కమిట్ అవ్వలేదు. ఇంతలోనే వేవ్స్ అడ్వైసరీ బోర్డ్ మెంబర్ అంటూ కొత్త అప్డేట్ అందించారు మెగాస్టార్.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×