Thandel Day 1 Collections : టాలీవుడ్ హీరో అక్కినేని హీరో నాగ చైతన్య తాజాగా తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీకి ఒకవైపు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంటే మరోవైపు యావరేజ్ టాక్ ను అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. సినిమా స్టోరీ ఎలా ఉన్నా కూడా నాగచైతన్య సాయి పల్లవి ఇద్దరూ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే ఈ మూవీ నెగిటివిటిని అందుకుంది. అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం పర్వాలేదనిపించాయని తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. కానీ రిలీజ్ అయ్యాక ఆ టాక్ వినిపించలేదు. కలెక్షన్స్ మాత్రం కొన్ని ఏరియాల్లో బాగానే వసూల్ చేశాయి. మరి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి చూద్దాం..
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రెండో మూవీ తండేల్.. వీరిద్దరి కాంబోలో గతంలో లవ్ స్టోరీ అనే మూవీ వచ్చింది. ఆ మూవీ కూడా యావరేజ్ టాక్ ను అందుకున్న కూడా వీరిద్దరి పెయిర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ సినిమాలోని సాంగ్స్ అన్ని బాగా హిట్ అయ్యాయి.. ఇప్పుడు తండేల్ మూవీతో మరోసారి ఈ జంట ప్రేక్షకులను పలకరించారు. కార్తీకేయ 2 మూవీతో పాన్ ఇండియా లెవల్ లో ఫేమస్ అయ్యాడు డైరెక్టర్ చందు మొండేటి.. ఈ మూవీకి ఆయనే దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహారించారు. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చింది.. సినిమా మొదటి షో ని యావరేజ్ టాక్ ని అందుకోవడం తోపాటు అంతంత మాత్రంగానే కలెక్షన్స్ను రాబట్టిందని టాక్.. అలాగే పలు ఏరియాలో నెగిటివ్ టాక్ ను కూడా అందుకుంది. మొదటిరోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం..
తండేల్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే.. తండేల్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ ఏపీ, నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, హిందీ, ఓవర్సీస్ ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 11 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దాంతో రెండు రాష్ట్రాల్లో 27 కోట్ల మేర రైట్స్ బిజినెస్ వాల్యూ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.. దాదాపు 60 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ మూవీ 11 కోట్ల గ్రాస్ ను మాత్రమే రాబట్టినట్లు సమాచారం.. ఏరియాల వైజ్ మొదటి రోజు ఎన్ని కోట్లు రాబాట్టిందంటే.. నైజాం రూ. 4.60 కోట్లు, వైజాగ్.రూ.1.40 కోట్లు,సీడెడ్ రూ.1.80 కోట్లు, ఈస్ట్ రూ .0.75 కోట్లు,వెస్ట్ రూ.0.55, కృష్ణా రూ. 0.90, గుంటూరు రూ. 0.75, నెల్లూరు రూ. 0.44, హింది… 0.15, తమిళ్ రూ. 0.05 కోట్లు వసూల్ చేసింది.. మొత్తానికి 11 వరకు గ్రాస్ ను రాబట్టింది. పాజిటివ్ టాక్ రాక పోవడంతో కలెక్షన్స్ తగ్గాయ్యని తెలుస్తుంది. ఇక HD ప్రింట్ రావడం కూడా సినిమా కలెక్షన్లు తగ్గడానికి కారణం అయింది. పైరసీని కంట్రోల్ చేయడంలో విఫలయ్యారు. దాని ఎఫెక్ట్ కలెక్షన్ల పై పడింది.. ఈ వీకెండ్ అన్నా కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి..