BigTV English

Ayurvedic Beauty Care: ఆయుర్వేద మూలికలతో మొటిమలు, మచ్చలకు చెక్..!

Ayurvedic Beauty Care: ఆయుర్వేద మూలికలతో మొటిమలు, మచ్చలకు చెక్..!

Ayurvedic Beauty Care: వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల చర్మం రంగు మారుతూ ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చే వేడి మెలనిన్ ను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చర్మం నల్లగా మారడంతో పాటు ముఖంపై మొటిమలు, మచ్చలు పెరుగుతాయి. అందుకే వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచుకోవడానికి ఆయుర్వేదిక మూలికలను వాడటం మంచిది అవేంటో ఇప్పుడు చూద్దాం.


చందనం:

ఎండాకాలంలో వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు చందనాన్ని ఉపయోగించవచ్చు .దీని పాలల్లో కలిపి తాగడం వల్ల ఎండ నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా వేసవిలో చందనం పొడిని ఫేస్‌ప్యాక్‌లా కూడా వేసుకోవచ్చు. చర్మం జిడ్డుగా ఉంటే కాస్త చెందనం పొడిలో రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. ఒక వేళ పొడి చర్మమైతే దానిని పచ్చిపాలతో కలిపాలి. ఇది మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది


అలోవెరా:

ఎండ నుంచి ఉపశమనం పొందడానికి అలోవెరా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలోవెరా చర్మాన్ని తేమగా మార్చడానికి సహాయపడుతుంది. అలోవెరాను రకరకాల ఉపయోగించవచ్చు ఎండాకాలంలో చర్మం మాత్రమే కాకుండా వెంట్రుకలు కూడా సూర్యరశ్మి తగిలి పొడిబారడం కనిపిస్తుంది. అయితే అటువంటి సమయంలో దీన్ని ఫేస్‌ ప్యాక్‌లాగా కూడా ఉపయోగించవచ్చు. ముఖం మెరుస్తూ ఉండటంతో పాటు మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి.

Also Read: Migraine: మైగ్రేన్ వేధిస్తోందా ? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!

వేపాకు:

వేప ఆకులను అప్పుడప్పుడు తింటే చాలా మేలు జరుగుతుంది. ఇవి శరీరంలోని టాక్సిన్ లను బయటకు పంపడంలో సహాయ పడతాయి. మొటిమలు, మచ్చలు లేని ముఖం కోసం దీనిని ఉపయోగించవచ్చు. కొందరు ఫేస్ ప్యాక్ లాగా కూడా వేపాకును తయారు చేసుకొని ఉపయోగిస్తారు. ఒక వేళ దీని వాసన నచ్చకపోతే ఎండు ఆకులను గ్రైండ్ చేసి ఉపయోగించవచ్చు. ఇది ముఖంపై మచ్చలు రాకుండా చేస్తుంది.

మంజిష్ట:

మంజిష్ట శరీరం చల్లబడడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రసిద్ధి చెందిన ఆయుర్వేద మూలిక. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. మంజిష్ట పొడిని ముఖానికి తేనె కలిపి రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీంతో ముడతల సమస్య కూడా దూరమవుతుంది. మచ్చలు రాకుండా ఉంటాయి.

Also Read: చియా సీడ్స్‌తో గ్లాస్ స్కిన్.. ఎలా వాడాలో తెలుసా మరి..?

బెయిల్ రసం:

ఎండాకాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి మొటిమలు లేదా చర్మ సమస్యలకు దారితీస్తాయి. మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ముఖం మీద మొటిమలు రావడానికిది సాధారణ కారణాల్లో వేడి ఒకటి. అటువంటి పరిస్థితిలో బియిల్ రసం తీసుకోవడం వల్ల పేగులలోని వేడిని తగ్గుతుంది. అంతే కాకుండా చర్యం కాంతి వంతంగా ఉంటుంది.

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×