BigTV English

Weight Loss: వెల్లుల్లితో ఈజీగా వెయిట్ లాస్.. ఎలానో తెలుసా ?

Weight Loss: వెల్లుల్లితో ఈజీగా వెయిట్ లాస్.. ఎలానో తెలుసా ?

Garlic for Weight Loss: ప్రతి వంటింట్లో వెల్లుల్లి ఉంటుంది. ఈ వెల్లుల్లితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే బరువు తగ్గడానికి కూడా ఇది చక్కటి ఔషధంగా పని చేస్తుందట. కూరలు, పచ్చళ్లలో మనం వెల్లుల్లి విరివిగా వాడుతుంటాం. వెల్లుల్లి వేయకుండా చేసిన ఏ కర్రీ అంత టేస్ట్‌గా కూడా అనిపించదు. ఎందుకంటే వెల్లుల్లిలో ఉండే ఘాటైన రుచి, సువాసన వంటకాలకు మరింత రుచిని పెంచుతుంది.


ఇదిలా ఉంటే ఆరోగ్యానికి మంచిదని పచ్చి వెల్లుల్లిని కూడా కొందరు తింటుంటారు. వెయిట్ లాస్ అవడానికి కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. బరువు తగ్గడం కోసం వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి అనే అంశాలకు సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి:
వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్ యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అందుకే మార్నింగ్ వెల్లుల్లి వాటర్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యం:
వెల్లుల్లిలో అలిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త నాళాల్లో విస్తరించి రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజు ఉదయాన్నే వెల్లుల్లి వాటర్ తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
బరువు తగ్గడానికి:
వెల్లుల్లిలో ఉండే కొన్ని రకాల గుణాలు కొవ్వును కరిగించడంలో సహాయం చేస్తాయి. డెలీ మార్నింగ్ వెల్లుల్లి వాటర్ తాగడం వల్ల ఆరోగ్యకరమైన బరువును కొనసాగించవచ్చని అంటున్నారు. ఓ అధ్యయనం ప్రకారం వెల్లుల్లి కొవ్వు కణాల పెరుగుదలను తగ్గించడంతో పాటు కొవ్వును కరిగించి.. బరువు తగ్గటంలో సహాయపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పరిశోధన చైనాలో జరిగింది.
చర్మ ఆరోగ్యం:
వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని కాపాడతాయి. దీని వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటుంది. ఫలితంగా యవ్వనంగా కనిపిస్తారు. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి.
Also Read: వర్షాకాలంలో పెరుగు తింటే ఏం అవుతుంది.. ఆరోగ్యానికి మంచిదేనా.?

కేలరీలను బర్న్ చేసి ఎనర్జీ లెవల్స్‌ను పెంచడానికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఫిట్‌గా ఉంచుతుంది. జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలోనూ ఇది సహాయపడుతుంది. వెల్లుల్లి ఆకలిని తగ్గించే మందు. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. అతిగా తినకుండా కూడా నివారిస్తుంది. వెల్లుల్లి గొప్ప డీ టాక్సిఫైయింగ్ ఏజెంట్. ఇది జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగించే టాక్సిన్స్ బయటకు పంపడంలో సహాయపడుతుంది.


వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలి:
ఉదయాన్నే పచ్చి వెల్లుల్లిని తినవచ్చు. నిజానికి గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, వెల్లుల్లిని కలిపి ఆ నీటిని తాగవచ్చు. ఇందులో ఉన్న నిమ్మరసం కూడా బరువు తగ్గించే ఉత్తమ పదార్థాలలో ఒకటి.

Tags

Related News

Causes Of Anger: ప్రతి చిన్న విషయానికీ కోపం వస్తుందా.. ? కారణాలివే !

Longtime Sitting: ఆఫీసులో ఎనిమిది నుంచి పది గంటలు కూర్చుంటున్నారా? అయితే ఈ వ్యాధి త్వరలోనే వచ్చేస్తుంది

Weight Loss Tips: ఉదయం పూట ఇలా చేస్తే.. ఈజీగా వెయిట్ లాస్

Strawberries: డైలీ స్ట్రాబెర్రీలు తింటే.. శరీరంలో జరిగే మార్పులివే !

Open Pores On Face: ఓపెన్ పోర్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ?

Pumpkin Seeds: డైలీ గుమ్మడి గింజలు తింటే.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !

Big Stories

×