Hibiscus Flower For Hair: మందార పూలు జుట్టుకు చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా జుట్టును సహజంగానే ఆరోగ్యంగా, మందంగా, మెరిసేలా చేయడానికి మందార పూలు సహాయపడతాయి. మందార పూలలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు జుట్టుకు కావాల్సిన పోషణను అందిస్తాయి. అంతే కాకుండా జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా.. జుట్టు రాలడం, చిట్లడం, చుండ్రు వంటి సమస్యలను క్రమంగా తగ్గిస్తుంది. మందార పూలతో జుట్టుకు కలిగే ప్రయోజనాలతో పాటు జుట్టుకు ఉపయోగించే సరైన విధానాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మందార పూల యొక్క ప్రయోజనాలు:
జుట్టును నల్లగా చేయడం:
మందార పూలు సహజ వర్ణద్రవ్యం కలిగి ఉంటాయి.ఇవి తెల్ల జుట్టును నల్లగ మార్చడానికి సహాయపడతాయి. ఇవి జుట్టుకు సహజమైన నల్లని రంగును ఇవ్వడానికి సహాయపడుతాయి. ముఖ్యంగా మందార పూలతో తయారు చేసిన హెయిర్ మాస్క్ లేదా నూనెగా క్రమం తప్పకుండా ఉపయోగిస్తే తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది.
జుట్టు పెరుగుదల:
మందార పూలలో లభించే అమైనో ఆమ్లాలు, ముఖ్యమైన విటమిన్లు జుట్టు మూలాల్లోకి లోతుగా చేరి వాటిని పోషిస్తాయి. అంతే కాకుండా ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కొత్త జుట్టు పెరుగుదల ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది సన్నగా ఉన్న జుట్టును మళ్ళీ మందంగా చేయడంలో సహాయపడుతుంది.
చుండ్రు తగ్గుదల:
మందారంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తలపై పేరుకుపోయిన మురికి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చుండ్రును తొలగించడంలో సహాయపడతాయి. ఇది దురదను తగ్గించడమే కాకుండా.. తలపై చర్మాన్ని ఆరోగ్యంగా , శుభ్రంగా ఉంచుతుంది.
జుట్టును బలోపేతం చేయడం:
మీ జుట్టు సులభంగా చిట్లిపోయినా లేదా రాలిపోయినా కూడా మందార పూలతో తయారు చేసిన నూనె లేదా మాస్క్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా క్రమంగా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.తరచుగా జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడే వారు మందార పూలతో తయారు చేసిన హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి బయట మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ తో పోలిస్తే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Also Read: డైలీ ఇలా చేస్తే.. అమ్మాయిలే అసూయపడే అందం
మందార హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి ?
2 టేబుల్ స్పూన్ల మందార పొడి లేదా తాజా 3 మందార పువ్వులను గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసుకోండి. తర్వాత దీనికి 3 టేబుల్ స్పూన్ల పెరుగు కలపండి. మీకు కావాలంటే..దీనికి కొంచెం నిమ్మరసం లేదా తేనె కూడా కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసిన ఈ పేస్ట్‌ను జుట్టు మూలాల నుండి చివరల వరకు బాగా అప్లై చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా జుట్టు ఒత్తుగా పెరగడంలో, రాలడాన్ని నివారించడంలో ఇది ఉపయోగపడుతుంది.