Skin Routine: మన చర్మానికి రాత్రిపూట విశ్రాంతి, పోషణ ఎక్కువగా అవసరం. ముఖ్యంగా జిడ్డు చర్మానికి (Oily sin) చాలా ముఖ్యం. పగటిపూట దుమ్ము, కాలుష్యంతో పాటు ఇతర కారణాల వల్ల చర్మంపై మురికి, అదనపు నూనె పేరుకుపోతుంది. ఇది మొటిమలు, బ్లాక్ హెడ్స్, ఇతర సమస్యలకు కారణమవుతుంది. అందుకే రాత్రిపూట కొన్ని రకాల స్కిన్ కేర్ టిప్స్ పాటించడం వల్ల మీరు ఈ సమస్యలను నివారించవచ్చు. అంతే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు.
ఈ టిప్స్ తప్పకుండా పాటించాలి :
జిడ్డు చర్మానికి నైట్ స్కిన్ కేర్:
జిడ్డు చర్మం రోజంతా అదనపు నూనెను ఉత్పత్తి చేస్తుంది.ఫలితంగా రంధ్రాలను మూసుకుపోతుంది. అంతే కాకుండా మొటిమలు, బ్లాక్ హెడ్స్, ఇతర చర్మ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. రాత్రిపూట, మనం నిద్రపోతున్నప్పుడు.. మన చర్మం తనను తాను రిపేర్ చేసుకోవడానికి , పునరుద్ధరించుకోవడానికి పనిచేస్తుంది. చర్మం శుభ్రంగా లేకపోయినా లేదా తగిన పోషణ పొందకపోతే.. ఈ ప్రక్రియ సరిగ్గా జరగదు.
మేకప్ తొలగింపు:
మీరు ప్రతి రోజు రాత్రి స్కిన్ కేర్ టిప్స్ పాటించాలి.దీనిని ఎల్లప్పుడూ మేకప్ తొలగించడం ద్వారా ప్రారంభించండి. మంచి మేకప్ రిమూవర్ లేదా మైకెల్లార్ వాటర్ ఉపయోగించండి. ఇది మేకప్ తొలగించడమే కాకుండా చర్మంపై పేరుకుపోయిన మురికి, నూనెను కూడా వదులుతుంది. ఈ దశ చర్మాన్ని హానికరమైన రసాయనాలు, బిల్డ్-అప్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
శుభ్రపరచడం:
మేకప్ తొలగించిన తర్వాత.. చర్మాన్ని లోతుగా శుభ్రం చేసుకోవడం ముఖ్యం. జిడ్డుగల చర్మానికి, జెల్ లేదా ఫోమ్ ఆధారిత క్లెన్సర్లు ఉత్తమమైనవి. మీ చర్మ రకాన్ని బట్టి తగిన క్లెన్సర్‌ను ఎంచుకుని.. దానితో ముఖాన్ని బాగా కడగాలి. ఇది రంధ్రాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.
టోనింగ్:
చర్మాన్ని శుభ్రపరిచిన తర్వాత టోన్ చేయడం ముఖ్యం. టోనర్ వాడటం వల్ల చర్మం యొక్క pH స్థాయి సమతుల్యం అవుతుంది. ఇది తెరిచి ఉన్న రంధ్రాలను బిగించి ఇన్ఫెక్షన్ లేదా మొటిమల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఎక్స్‌ఫోలియేషన్:
వారానికి ఒకటి లేదా రెండుసార్లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం ముఖ్యం. ఎక్స్‌ఫోలియేటర్ మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని తాజాగా, శుభ్రంగా ఉంచుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా , ప్రకాశవంతంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.
సీరం:
చర్మానికి పోషణ, తేమను అందించడానికి సీరమ్‌లను ఉపయోగించడం ముఖ్యం. జిడ్డు చర్మం ఉన్నవారు.. చర్మాన్ని జిడ్డుగా చేయకుండా హైడ్రేట్ చేసే, చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడే తేలికపాటి సీరమ్‌లను ఎంచుకోండి.
Also Read: మామిడి ఆకులను ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది తెలుసా ?
మాయిశ్చరైజింగ్:
మీకు జిడ్డుగల చర్మం ఉన్నప్పటికీ.. మాయిశ్చరైజింగ్ చాలా ముఖ్యం. జిడ్డు చర్మం కోసం.. తేలికగా, జిడ్డుగా లేని.. అంటుకోని మాయిశ్చరైజర్‌ను ఎంచుకోండి. ఇది చర్మాన్ని తేమగా చేస్తుంది. అంతే కాకుండా అధిక నూనె ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఐ క్రీమ్:
కళ్ళ చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితమైనది. అందుకే దీనికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మంచి కంటి క్రీమ్ ఉపయోగించి కళ్ళ చుట్టూ ఉన్న చర్మాన్ని హైడ్రేట్ చేయండి. ఇది నల్లటి వలయాలు, ఫైన్ లైన్స్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.