Yograj Singh: వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు భారత దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. ధోని కెప్టెన్సీలో తన కుమారుడు యువరాజ్ సింగ్ కెరియర్ నాశనమైందరి గతంలో పలుమార్లు ఆరోపణలు చేసిన యోగరాజ్.. ధోని అంటే ఒంటి కాలిపై లేస్తుంటారు.
Also Read: Team India: బరితెగించిన టీమిండియా ప్లేయర్ భార్య… టాలీవుడ్ నిర్మాతతో ఆ పనులు !
అయితే తాజాగా యోగరాజ్ మాజీ సెలెక్టర్లపై విమర్శలు గుప్పించాడు. 2011లో భారత జట్టు ప్రపంచ కప్ గెలుపొందిన తరువాత నాటి బీసీసీఐ సెలెక్టర్లు పలువురు సీనియర్ ఆటగాళ్ల కెరీర్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారని కీలక విమర్శలు చేశారు యోగరాజ్. ఇటీవల ఓ క్రీడా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2011 – 12 సంవత్సరాలలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలలో భారత జట్టు ఘోరంగా విఫలమైన తర్వాత ఏకంగా ఏడుగురు కీలక ఆటగాళ్లని పాతాళంలోకి తొక్కేసారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ చీఫ్ సెలెక్టర్ మొహిందర్ అమర్నాథ్ పై యోగరాజ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. 2011 వరల్డ్ కప్ తర్వాత ధోని కెప్టెన్సీలో యువరాజ్ సింగ్ తో సహా దాదాపు ఏడుగురు ఆటగాళ్ల కెరియర్లు నాశనం చేశారని, ధోని కెప్టెన్సీని ప్రశ్నిస్తూ వన్డే ప్రపంచ కప్ లో ఛాంపియన్గా నిలిచిన భారత జట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఎలా ఓడిపోయిందో కూడా వివరించారు.
” ఎలాంటి కారణం లేకుండా మీరు ఏడుగురు కుర్రాళ్ల కెరీర్ ని నాశనం చేశారు. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యులు అయిన గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, వి.వి.ఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ వంటి వారిని క్రమంగా పక్కన పెట్టారు. ద్రవిడ్, లక్ష్మణ్ ఆ తర్వాత టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక మిగిలిన ఆటగాళ్లను అన్ని ఫార్మాట్ల నుండి దశలవారీగా తప్పించారు. 2015 వరల్డ్ కప్ ప్రణాళికలో వారికి చోటు దక్కకుండా చేశారు.
వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు 5 సిరీస్ లలో ఓడిపోయింది. ఈ ప్రదర్శన తరువాత సెలెక్టర్లు ధోనీని కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నారు. కానీ బీసీసీఐ అప్పటి అధ్యక్షుడు ఎస్ శ్రీనివాస్ అలా జరగనివ్వలేదు” అని యోగరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని 2012లో సిఎస్ఎన్ – ఐబిఎన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొహిందర్ అమర్నాథ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
సెలెక్టర్లను స్వతంత్రంగా పనిచేయనియడం లేదని, భారత క్రికెట్ ప్రయోజనాల దృశ్య నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తమకు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు యోగరాజ్ గుర్తు చేశారు. ఇలా అంతర్గత ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మహేంద్రసింగ్ ధోని 2014 చివరి వరకు టెస్టుల్లో కెప్టెన్ గా కొనసాగాడు. ఆ తర్వాత 2017 జనవరి వరకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో జట్టును నడిపించాడు. ధోని అనంతరం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. ఇలా యోగరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి క్రీడా వర్గాల్లో చర్చనియాంశంగా మారాయి.
Latest UY | Sports
Yograj Singh’s Explosive Claims on BCCI’s 2011 WC Fallout
Yograj Singh, Yuvraj Singh’s father, dropped a bombshell on June 16, 2025, accusing the BCCI selectors of ruining the careers of seven Indian cricket icons, including Gautam Gambhir, Rahul Dravid,… pic.twitter.com/XhXmyVexYG
— UnreadWhy (@TheUnreadWhy) June 16, 2025