Rosemary Oil For Hair: జుట్టు మందంగా, నల్లగా ఉండాలని ప్రతి ఒక్కరి కల. ఇందుకోసం అమ్మాయిలు రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు. అంతే కాకుండా ఖరీదైన షాంపూలను కూడా ట్రై చేస్తుంటారు. హెయిర్ ప్రొడక్ట్స్ కోసం వేలల్లో ఖర్చు చేసే వారు లేకపోలేదు. ఇలాంటి సమయంలో రోజ్ మేరీ ఆయిల్ వాడటం మంచిది. ఇది జుట్టుకు అన్ని రకాలుగా మేలు చేస్తుంది.
రోజ్మేరీ ఆయిల్ యొక్క ప్రయోజనాలు:
రోజ్మేరీ నూనెలో విటమిన్లు A, B, C, D2, D3. కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. రోజ్మేరీ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తలపై ఉండే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దీంతో పాటు, సోడియం, పొటాషియం, జింక్, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి లక్షణాలు ఈ నూనెలో కనిపిస్తాయి.
జుట్టు పెరుగుదల రెట్టింపు అవుతుంది:
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి.. మీరు రోజ్మేరీ నూనెను కొబ్బరి నూనెతో కలిపి కూడా వాడొచ్చు. ఈ నూనెలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అనేక గుణాలు ఉంటాయి. జుట్టు పెరుగుదలకు ఈ ఆయిల్ వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది:
మీ జుట్టు విపరీతంగా రాలిపోయి, అన్ని రకాల ఉత్పత్తులు ఉపయోగించినా ఈ సమస్య నుంచి బయట పడలేకపోతే.. రోజ్మేరీ ఆయిల్‌ను ఉపయోగించండి. దీనిని వాడటం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఇది జుట్టు మూలాలకు సరైన పోషణను అందిస్తుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడే వారు తరచుగా రోజ్ మేరీ ఆయిల్ వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
చుండ్రు తొలగిపోతుంది:
తలలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జుట్టులో చుండ్రు సమస్య వస్తుంది. దీనివల్ల అనేక రకాల జుట్టు సంబంధిత సమస్యలు వస్తాయి. ఈ సమస్య నుంచి బయట పడటానికి మీరు వారానికి కనీసం రెండుసార్లు తలకు రోజ్మేరీ నూనెను ఉపయోగించాలి. ఇది మీ తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా.. ఇది జుట్టు ఆకృతిని కూడా మెరుగుపరుస్తుంది. తరచుగా చుండ్రు సమస్యతో ఇబ్బంది పడే వారు రోజ్ మేరీ ఆయిల్ వాడటం
Also Read: డైలీ ఈ సీడ్స్ తింటే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
జుట్టుకు రోజ్మేరీ ఆయిల్ ఎలా అప్లై చేయాలి ?
తగినంత మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. తర్వాత ఒక చిన్న కప్పులో కొబ్బరి నూనె తీసుకుని అందులో రోజ్మేరీ ఆకులను వేసి గ్యాస్‌పై మరిగించండి. కాస్త మరిగిన తర్వాత అందులో మెంతి గింజలను వేయండి. అనంతరం చల్లార్చి. వడకట్టి, స్ప్రే బాటిల్‌లో నింపి స్టోర్ చేసుకోండి. ఈ ఆయిల్‌ను జుట్టు మూలాలపై అప్లై చేయండి. దీనిని వాడిన తర్వాత 30 నిమిషాలకు తలస్నానం చేయండి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదల కూడా బాగుంటుంది. తరచుగా రోజ్ మేరీ ఆయిల్ జుట్టుకు వాడటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.