Rahul Sipligunj: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎక్కడో పాతబస్తీ యువకుడిగా పేరు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ (RRR ) సినిమాతో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన మాట ప్రకారం నేడు ఆయన ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఈ మేరకు రాహుల్ కి భారీ నజరానా ప్రకటించి తన గొప్ప మనసు చాటుకున్నారు.
రాహుల్ సిప్లిగంజ్ కి భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..
అసలు విషయంలోకి వెళ్తే.. ఆస్కార్ అవార్డు పొందిన “నాటు నాటు” పాటను పాడిన రాహుల్ సిప్లిగంజ్ కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది. సొంత కృషితో ఎదిగిన రాహుల్ తెలంగాణ యువతకు రోల్ మోడల్ గా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి, ఈ భారీ నజరానా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డ్స్ ను ప్రకటించినప్పుడు.. ఈ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఆయనను కొనియాడారు. ఈ అవార్డు వేదిక మీదనే హైదరాబాదు లోకల్ కుర్రాడు అయిన రాహుల్ సిప్లిగంజ్ కు ప్రత్యేక అవార్డు ఏదైనా ఉంటే ప్రకటించాలి అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాదు త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని కూడా తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం బోనాల పండుగ సందర్భంగా కోటి రూపాయలు నగదు పురస్కారాన్ని ప్రకటిస్తూ.. మాట నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నాటు నాటు పాటతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు..
రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రాంచరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) సంయుక్తంగా నటించిన చిత్రం ఆర్.ఆర్.ఆర్. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt) హీరోయిన్గా నటించినది అంతేకాదు హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ కూడా ఇందులో భాగమైన విషయం తెలిసిందే. అజయ్ దేవగన్, శ్రియా శరన్ తో పాటు పలువురు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఏకంగా ఆస్కార్ అవార్డు లభించింది. మార్చి 2023లో జరిగిన 95వ అకాడమీ అవార్డు వేడుకల్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఎంపికైన తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను కాలభైరవతో కలిసి ఆస్కార్ వేదికపై ఆలపించారు. అలా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. మొత్తానికైతే ఎక్కడో హైదరాబాద్ లోకల్ కుర్రాడిగా పేరు తెచ్చుకున్న ఈయన.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు తెచ్చుకోవడం మామూలు విషయం కాదని చెప్పవచ్చు.
ALSO READ:Saiyaara: సినిమా చూస్తూ థియేటర్లలోనే ఏడ్చేసిన యువత..మరీ ఇంత దారుణమా?