BigTV English
Advertisement

NTR-Neel Film : తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఎన్టీఆర్, నీల్ మూవీకి అతిపెద్ద సమస్య సాల్వ్ అయినట్టే

NTR-Neel Film : తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఎన్టీఆర్, నీల్ మూవీకి అతిపెద్ద సమస్య సాల్వ్ అయినట్టే

NTR-Neel Film : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్ 31’ మూవీ షూటింగ్ మరికొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ షెడ్యూల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తుండగా, మరోవైపు ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. టైటిల్ విషయంలో ఇప్పటిదాకా నెలకొన్న సస్పెన్స్ కి రీసెంట్ గా జరిగిన ఓ వేడుక ద్వారా ఫుల్ స్టాప్ పడింది.


‘ఎన్టీఆర్ 31’కు టైటిల్ సమస్య సాల్వ్ అయినట్టే…

గత ఏడాది ‘దేవర’ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘వార్ 2’ మూవీతో డైరెక్ట్ గా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు ఈ హీరో. కానీ ఆయన అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ మాత్రం ‘ఎన్టీఆర్ 31’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుందని ప్రకటించి చాలా కాలమే అవుతుంది. ఎట్టకేలకు మూవీ సెట్స్ పైకి వెళ్లే సమయం ఆసన్నమైంది. అయితే అంతకంటే ముందు ఈ మూవీ టైటిల్ విషయంలో గత రెండు రోజుల వరకు సస్పెన్స్ నెలకొంది.


ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మేకర్స్ ఇంకా టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఇదే టైటిల్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ మరోవైపు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన రీసెంట్ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ని వాడడం హాట్ టాపిక్ గా మారింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్లో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తారక్ టైటిల్ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ప్రదీప్ రంగనాథన్ సినిమాకు నిర్మాతలు ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అనే టైటిల్ ని మార్చారు. ఈ  కొత్త టైటిల్ తోనే మూవీ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. దీంతో జూనియర్ ‘ఎన్టీఆర్ 31’ సినిమా టైటిల్ కు రూట్ క్లియర్ అయింది. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రదీప్ సినిమాకు ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అనే టైటిల్ ని మార్చడం వల్ల, ఎన్టీఆర్ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ ని కన్ఫామ్ చేసినట్టేనని అంటున్నారు ఆయన అభిమానులు.

ఫస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్

‘ఎన్టీఆర్ 31’ మూవీ షూటింగ్ ఫిబ్రవరి 20న మొదలు కాబోతోంది. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరగబోతుందని సమాచారం. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, పోలీస్ అధికారుల పాత్రలతో ఓ భారీ యాక్షన్ సన్నివేశంతో చిత్రీకరణను ప్రారంభిస్తారని తెలుస్తోంది. హై ఇంటెన్సిటీ ఉన్న ఈ సీన్ షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదని సమాచారం. ఆయన రెండవ షెడ్యూల్ లో జాయిన్ అవుతాడని అంటున్నారు. ఇక ఈ మూవీకి రవి బస్రూర్  సంగీతం అందిస్తుండగా, ఈ పాన్ ఇండియా మూవీ 2026 జనవరి 9న రిలీజ్ కాబోతోంది.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×