E-Paper
Advertisement

భార్య గర్భవతిగా ఉంటే భర్త క్షౌరం చేయించుకోకూడదా? అసలు నిజం ఇదే!

భార్య గర్భవతిగా ఉంటే భర్త క్షౌరం చేయించుకోకూడదా? అసలు నిజం ఇదే!
Advertisement

Husband Haircut During Wife Pregnancy: భారతీయ సమాజంలో గర్భధారణకు సంబంధించిన ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భార్య గర్భవతిగా ఉన్న సమయంలో దంపతులు కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. అందులో ఒకటి.. భార్యకు ఆరు నెలలు నిండిన తర్వాత భర్త హెయిర్ కట్,  షేవింగ్ చేయించుకోకూడదనే నమ్మకం. అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చింది? దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? అనే సందేహం చాలామందికి ఉంటుంది.

ఆరు నెలల తర్వాత క్షౌరం వద్దంటారు ఎందుకు?

కొన్ని ప్రాంతాలు, కుటుంబాల్లో భార్య గర్భం దాల్చిన తర్వాత ముఖ్యంగా ఆరో నెల లేదంటే ఏడో నెల నుంచి భర్త క్షౌరం చేయించుకోకూడదని చెబుతుంటారు. అంటే గడ్డం షేవ్ చేయడం, జుట్టు కట్ చేయించుకోవడం లాంటి పనులకు దూరంగా ఉండాలంటారు. ఇది అన్ని ప్రాంతాల్లో పాటించే ఒకే విధమైన సంప్రదాయం కాదు. కుటుంబం, ప్రాంతం, కులం, ఆచారాల ఆధారంగా ఈ నమ్మకాలలో మార్పులు కనిపిస్తాయి.

కటింగ్ చేయించుకుంటే ఏమవుతుంది?

Advertisement

ఇక్కడే కీలక ప్రశ్న ఎదురవుతుంది. భర్త జుట్టు కట్ చేయించుకోవడం, గడ్డం షేవ్ చేసుకోవడానికి.. భార్య గర్భంలో పెరుగుతున్న శిశువుకు సంబంధం ఉందా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య, శాస్త్రీయ పరిజ్ఞానం ప్రకారం భర్త హెయిర్ కట్, షేవింగ్ చేయించుకోవడం వల్ల గర్భంలోని శిశువుకు హాని జరుగుతుందని నిరూపించే ఆధారాలు లేవు. భర్త జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం షేవ్ చేసుకోవడం లాంటి సాధారణ వ్యక్తిగత శుభ్రత చర్యలకు గర్భంలోని శిశువు ఎదుగుదలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు వైద్యపరంగా ఆధారం లేదు.

మరి ఈ నమ్మకం ఎలా వచ్చింది?

పాతకాలంలో వైద్య సదుపాయాలు, శాస్త్రీయ అవగాహన ఇప్పటిలా అందుబాటులో ఉండేవి కావు. గర్భధారణ, ప్రసవం లాంటి విషయాల చుట్టూ కుటుంబ సభ్యులు అనేక జాగ్రత్తలు పాటించేవారు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల భయం. పాత రోజుల్లో ఇప్పుడున్నట్లు సేఫ్టీ రేజర్లు, యాంటీ సెప్టిక్ లోషన్లు ఉండేవి కాదు. కటింగ్, షేవింగ్ కోసం మంగలి దగ్గరికి వెళ్లేవారు. వాళ్లు వాడే కత్తులు కొన్నిసార్లు తుప్పు పట్టి ఉండేవి. క్షవరం చేసేటప్పుడు చిన్న గాయం అయినా, దాని ద్వారా సెప్టిక్ అవ్వడం, ధనుర్వాతం లాంటి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉండేది. చిన్న గాయం కూడా ప్రాణాంతకం అయ్యేది.  భార్య నిండు గర్భిణిగా ఉన్న సమయంలో, భర్తకు ఏదైనా అనారోగ్యం వస్తే, ఆ కుటుంబానికి, ముఖ్యంగా గర్భవతి అయిన భార్యకు తీవ్రమైన మానసిక ఆవేదన కలిగిస్తుంది. ఆమెకు సేవ చేయాల్సిన సమయంలో భర్త మంచాన పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ నియమం అందుబాటులోకి వచ్చినట్లు పెద్దలు చెప్తుంటారు.

నమ్మకం వేరు.. శాస్త్రం వేరు!

Advertisement

ఇలాంటి సంప్రదాయాలను పాటించడం అనేది వ్యక్తిగత, కుటుంబ విశ్వాసానికి సంబంధించిన విషయం. అయితే వాటిని శాస్త్రీయంగా నిరూపించబడిన వైద్య నియమాలుగా భావించడం మాత్రం సరికాదు. అదే సమయంలో గర్భధారణ సమయంలో నిజంగా పాటించాల్సిన జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం.

Read Also: 1975లో పెళ్లి ఖర్చులు.. అమ్మమ్మ లెక్కల చిట్టా చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Tags

Related News

చిన్న బెడ్‌రూమ్‌లో కప్‌బోర్డ్ లేదా? ఈ స్మార్ట్ స్టోరేజ్ ఐడియాలతో సమస్యకు చెక్

మద్యం మానాలనే కోరిక ఉన్నా వదల్లేని స్థితి.. అధ్యయనంలో బయటపడిన షాకింగ్ నిజాలు!

ఎనర్జీ ఇస్తుందనుకుంటే.. ప్రాణాలకే ఎసరు పెడుతోంది.. తల్లిదండ్రులూ జాగ్రత్త!

నోరూరించే బీరకాయ కొత్తిమీర చట్నీ..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు

హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ మసాలా వడ..ఈవెనింగ్ స్నాక్స్‌కి పర్ఫెక్ట్!

ట్రెడిషనల్ స్టైల్ కట్టే పొంగలి..ఇలా చేస్తే తిన్నవాళ్ళు మెచ్చుకోవాల్సిందే!

మెట్టెలు, ముక్కుపుడక కేవలం అలంకారమేనా? ఆడవాళ్లకు వీటిని తప్పనిసరి చేయడం వెనుకున్న కారణాలివే!

Big Stories

Advertisement
×