Heathrow Airport: ఫ్లైదుబాయ్ విమానం ఘటన తర్వాత ఈ వారంలో దాదాపు మూడు విమానాలు ఎమర్జెన్సీ కోడ్ యాక్జివేట్ చేయడం ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. తాజాగా ఇప్పుడు బ్రిటీష్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఓ విమానం వంతైంది. వేల అడుగులు ఎత్తులో ఉన్న విమానం, ఎమర్జెన్సీ కోడ్ యాక్టివేట్ కావడంతో 28 వేల అడుగులకు దిగిపోయింది. అసలు ఏం జరిగింది?
సోమవారం లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టు నుండి అమెరికాలోని చికాగోకు వెళ్తోంది బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం BA295. గాలిలో 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. అప్పుడు ఐరిష్ గగనతలంపై ప్రయాణిస్తోంది ఆ విమానం. సాంకేతిక లోపం తలెత్తడంతో సిబ్బంది గగనతలంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
ఉన్నట్లుండి విమానం కిందకు దిగడం ప్రారంభించడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఆ సమయంలో విమానయాన సంస్థ 7700 అనే అత్యవసర కోడ్‌ను జారీ చేసింది. లండన్ పోర్టు నివేదికల ప్రకారం.. బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం BA295 లండన్ హీత్రూ విమానాశ్రయంలోని టెర్మినల్ 5 నుండి చికాగోలోని ఓ హేర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అక్కడి కాలమాన ప్రకారం సోమవారం ఉదయం 11.50 గంటలకు బయలుదేరింది. డెస్టినేషన్ చేరుకోవాలంటే సుమారు 8 గంటల 40 నిమిషాలు పడుతుంది.
నిమిషాల వ్యవధిలో విమానం 28000 అడుగులు కిందకు దిగిపోయింది. ఆ విమానం మళ్లీ హీత్రూ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఈ సంఘటన గురించి బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. విమానాన్ని మళ్లించడానికి గల కారణాన్ని ధృవీకరించలేదు. బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ విమానం క్యాబిన్ ప్రెషరైజేషన్ సమస్య ఎదుర్కొంటున్నందున విమాన సిబ్బంది లండన్ హీత్రూ విమానాశ్రయంకు తిరిగి వస్తున్నారు.
క్యాబిన్ ఎత్తు 10,500 అడుగులకు చేరుకుందని, ఇంధనాన్ని డంప్ చేయలేరని ఆ సందేశంలో పేర్కొంది. విమానం ప్రస్తుత బరువు.. దాని గరిష్ట ల్యాండింగ్ బరువు కంటే 30 మెట్రిక్ టన్నులు ఎక్కువగా ఉంది. అయినప్పటికీ పైలట్లు ఏదో ఒక విధంగా బ్రిస్టల్ ఛానల్ మీదుగా తమ ఇంధనాన్ని జెట్టిసన్ చేయడంలో సక్సెస్ అయ్యారు. హీత్రూ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కోసం సుమారు 45 నిమిషాల సేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది విమానం.
విమానం తన ట్రాన్స్‌పాండర్‌పై 7700 కోడ్‌ను జారీ చేస్తుంది ఎందుకు? విమాన ప్రయాణ సమయంలో ఉపయోగించే సాధారణ అత్యవసర సంకేతం. దీని తర్వాత విమాన కదలికలను ఎయిర్ ట్రాఫిక్, ఫ్లైట్-ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా పర్యవేక్షిస్తారు. అత్యవసర ల్యాండింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. 7700 కోడ్‌ను ఉపయోగించడానికి సాధారణ కారణాలు ఇవే. అనారోగ్యంతో ఉన్న ప్రయాణీకుడికి తక్షణ వైద్య సహాయం అవసరం అయినప్పుడు, ఇంజిన్ సమస్య, కాక్‌పిట్‌లో పొగ, లేదా క్యాబిన్ పీడనం తగ్గడం, వాతావరణ-సిస్టమ్ సమస్య సరిగా లేక కుదుపులు, పక్షి ఢీకొట్టడం, విమాన నియంత్రణ వైఫల్యం సమయంలో ఎమర్జెన్సీ కోడ్ యాక్టివేట్ చేస్తారు.
ALSO READ: 31 అడుగుల ఒంటి స్తంభం.. 700 ఏళ్ల చరిత్రకు సాక్ష్యం.. నల్లగొండలో ఈ చారిత్రక కట్టడం ఎక్కడుందో తెలుసా?