BigTV English

Gastric: ఇలా చేస్తే గ్యాస్ట్రిక్‌ సమస్య నుంచి బయటపడొచ్చు

Gastric: ఇలా చేస్తే గ్యాస్ట్రిక్‌ సమస్య నుంచి బయటపడొచ్చు

ప్రధానంగా మన ఆహారపు అలవాట్లలో తేడాల వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామంది గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. మనం తిన్న ఆహారం కడుపులోకి వెళ్లిన తర్వాత అది అరగడానికి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ యాసిడ్‌ ఘాటు ఎక్కువగా ఉంటుంది. 0.8 నుంచి 1.2 మధ్య ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్టిక్ సమస్యకు కారణం హెచ్ ఫైలోరియా అనే బాక్టీరియా. కొంతమందికి నీళ్లు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. నీళ్లు తక్కువ తాగితే అంచుల వెంబటి జిగురు ఎక్కువగా ఉత్పత్తి కాదు. దీంతో యాసిడ్ ఘాటు తట్టుకునే శక్తి ఈ లైనింగ్ సెల్స్‌కి ఉండదు. కొంతమంది కాఫీలు, టీలు ఎక్కువగా తాగుతుంటారు. వీటిలో ఉండే కెఫెన్ గ్యాస్టిక్ వచ్చే అవకాశం రెట్టింపు చేస్తుంది. కొందరికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జిగురు ఉత్పత్తి అవుతుంది. కొంతమంది గ్యాస్‌ టాబ్లెట్లు వాడకుండా పెయిన్ కిల్లర్స్ వాడుతారు. దీని వల్ల కూడా గ్యాస్టిక్ సమస్య అధికమవుతుంది. మరికొందరు టైంకు తినకుండా ఉంటారు. దీని వల్ల కూడా గ్యాస్ పెరుగుతుంది. ఇక మరికొందరైతే కూల్ డ్రింక్స్, పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్టిక్ సమస్యకు గురవుతున్నారు. గ్యాస్ వచ్చినప్పుడు ముఖ్యంగా కడుపులో నొప్పి, చెస్ట్ పెయిన్‌గా కూడా ఉంటుంది. కడుపులో ఆహారం పడిన అరగంట తర్వాత మంట తగ్గుతుంది. ఫుడ్ అరిగిన తర్వాత కూడా మంటగా అనిపిస్తుంది. ఈ సమయంలో పాలు గాని, మంచినీళ్లు గాని, మజ్జిగ గాని, ఏదో ఒకటి తాగి పడుకుంటే మంట తగ్గుతుంది. గ్యాస్టిక్ వచ్చిన వారు ఉప్పు, కారం, పులుపునకు దూరంగా ఉండాలి. ఎప్పుడైతే కడుపు ఖాళీగా ఉంటుందో అప్పుడు యాసిడ్ లైనింగ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ముఖ్యంగా మన జీవన శైలిని మార్చుకోవాలి. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. కారం, మసాలాలు ఉన్న ఆహారం తక్కువగా తీసుకుంటే మంచిది. ఇలా చేస్తే గ్యాస్ తొందరగా తక్కువ అవుతుంది.


Tags

Related News

Migraine: మైగ్రేన్ తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Saggubiyyam Payasam: సగ్గుబియ్యం పాయసం.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్ !

Cheese Pasta: అద్భుతమైన రుచితో ‘చీజ్ పాస్తా’, ఇలా తయారు చేస్తే.. లొట్టలేసుకుంటూ తింటారు !

Brain Boosting Foods: ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ఫుడ్స్ ఏవో తెలుసా ?

Soaked Raisins: డైలీ ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే.. ఇన్ని లాభాలా ?

Natural Honey: స్వచ్ఛమైన తేనె vs కల్తీ తేనె – ఇంట్లోనే తేడా తెలుసుకోండి!

Face Scrub: ఈ ఫేస్ స్క్రబ్స్ వాడితే.. ముఖం మెరిసిపోతుంది తెలుసా ?

Sleep Fast Tips: నిద్ర పట్టడం లేదా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

Big Stories

×