BigTV English

Sugandha Pala Plant Root: ఈ వేర్లతో కషాయం చేసుకుని తాగితే కీళ్ల నొప్పులు ఇట్టే మాయం అవుతాయి

Sugandha Pala Plant Root: ఈ వేర్లతో కషాయం చేసుకుని తాగితే కీళ్ల నొప్పులు ఇట్టే మాయం అవుతాయి

Sugandha Pala Plant Root: మొక్కలకు సంబంధించిన ప్రతీ దానితోను శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆకులు, పువ్వులు, కాండం, వేర్లు ఇలా ప్రతీ దానితోను ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. ఒక్కో మొక్కతో ఒక్కో రకమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ప్రత్యేకమైనది సుగంధ పాల వేర్లు. దీనిని ఆయుర్వేద మూలికల్లోను ఉపయోగిస్తారు. ఇది శరీరానికి చలువ చేయడంతో పాటు పుష్కలమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. సుగంధ పాల వేర్లలో యాంటీ బ్యాక్టీరియల్, వైరల్ గుణాలు ఉంటాయి. మరోవైపు ఈ వేరు యొక్క వాసన కూడా అద్భుతంగా ఉంటుంది. దీనిపై ఉండే మట్టిని తొలగిపోయేలా శుభ్రంగా కడుక్కుని తీసుకోవాలి.


వేసవికాలంలో ఈ సుగంధ పాల వేర్లు అద్భుతంగా పని చేస్తాయి. శరీరంలో అధిక వేడి ఉన్న వారు దీనిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇది శరీరానికి చలువ చేస్తుంది. అనారోగ్య సమస్యలను బారిన పడకుండా కూడా రక్షిస్తుంది. దీనిని చాలా రకాలుగా తీసుకోవచ్చు. జ్వరం వంటి సమస్యలు ఎదురైన సమయంలో సుగంధ పాల వేర్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సుగంధ పాల వేర్లతో కషాయం తయారుచేసుకుని తాగాల్సి ఉంటుంది. వేడి నీటిలో వేసుకుని కషాయం తయారుచేసుకుని అనారోగ్య సమస్యలు ఎదురైనపుడు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని కూడా పెంచేందుకు కూడా ఈ కషాయం అద్భుతంగా ఉపయోగపడుతుంది.

అనారోగ్యం బారిన పడిన సమయంలో సుగంధ పాల వేర్ల కషాయం తీసుకుంటే ఆకలిని పెంచి తొందరగా కొలుకునేలా చేస్తుంది. దీనిని కషాయంలా మాత్రమే కాకుండా దీని వేరును శుభ్రంగా కడిగి నమిలి తిన్నా కూడా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మరోవైపు శరీరంలోని చెడు మలినానలు కూడా తొలగించడానికి కూడా సహాయపడుతుంది. సుగంధ పాల వేర్లతో శరీరంలోని రక్తప్రరణను మెరుగుపరుచుకోవచ్చు. వర్షాకాలంలోను ఈ వేరును తీసుకుంటే ఇన్ఫెక్షన్ల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది.


సుగంధ పాల వేర్లతో కషాయం తయారుచేసుకుని తరచూ తీసుకుంటే జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు యూరిన్ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. చర్మం కాంతివంతంగా మారేలా చేస్తుంది.

సుగంధ పాల వేరు కషాయం తయారీ విధానం..

సుగంధ పాల వేరును శుభ్రంగా కడిగి ఓ రెండు కప్పుల నీటిని తీసుకుని వేరు పొడి, మిరియాలు, యాలకులు, అల్లం వేసి బాగా మరిగించాలి. అనంతరం నీటిని వడపోసి అందులో పూదీనా ఆకులు, తేనె కలిపి తాగాలి. ఇలా ప్రతీ రోజూ రెండు సార్లు తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Big Stories

×