Handloom Handicrafts Expo: భారతీయ కళలకు ప్రాణం పోస్తూ.. సాంప్రదాయాన్ని ఆవిష్కరిస్తూ హైదరాబాదు వేదికగా “దస్త్కారి హాథ్ హ్యాండ్లూమ్ & హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో” ఘనంగా ప్రారంభం అయ్యింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కళింగ కల్చరల్ సెంటర్లో దీనిని ఘనంగా ప్రారంభించారు. భారతీయ వైవిద్య భరిత సంస్కృతిని ప్రతిబింబిస్తూ.. దేశం నలుమూలల నుండి వచ్చిన నేత కార్మికులు, చేనేతలు భారతీయ సాంప్రదాయ కళా నైపుణ్యాల ఔన్నత్యం ఒకే వేదికపై తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ వస్త్ర ప్రదర్శనను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాలి సుధారాణి, నిర్వాహకురాలు సమీన్ షా కలిసి దీనిని ప్రారంభించారు.
సాంప్రదాయ కళలను ప్రోత్సహించడమే ధ్యేయం..
ఈ సందర్భంగా గ్రామీణ కళాకారులను నేరుగా కొనుగోలుదారులతో కలిపి ఈ వేదిక వారి జీవనోపాధిని కాపాడటమే కాకుండా భారతీయ కళలను సంరక్షించడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని నిర్వాహకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఈ ఎక్స్పో సందర్భంగా నిర్వాహకులు సమీన్ షా మాట్లాడుతూ.. “దస్త్కారి హాథ్ మొదటిసారి హైదరాబాద్ నగరంలో ఎగ్జిబిషన్ కం సేల్ ను నిర్వహిస్తోంది. భారతదేశంలోని వివిధ గ్రామీణ ప్రాంతాల నేత కార్మికులు, మహిళల జీవనోపాధి కోసం దస్త్కారి హాథ్ ఎప్పుడూ అండగా నిలుస్తోంది. ఇదే విధమైన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ.. ఒక గుర్తింపును చాటుకుంటుంది. ముఖ్యంగా వారణాసి ఘాట్ల నుండి బీహార్ గ్రామాల వరకు..బెంగాల్ నుండి తమిళనాడు వరకు.. అస్సాం పర్వతాల నుండి రాజస్థాన్ ఎడారుల వరకు 30 కంటే ఎక్కువ రకాల పట్టు వస్త్రాలను ఒకే వేదికపై తీసుకువస్తున్నారు..
ఐదు రోజులపాటు ఘనంగా ఎగ్జిబిషన్..
అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం నేరుగా బట్టలు నేసే వాళ్ల కుటుంబాలకు చేరుతుంది. దస్త్కారి హాథ్ ఆగస్టు 20 నుండి ఆగస్టు 25 వరకు సౌందర్యం, విలాసవంతమైన హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్ ను మీరు కూడా అనుభవించండి. 60కి పైగా స్టాళ్లలో పట్టు, సిల్క్, కాటన్, జాంధాన్ని మరెన్నో ప్రత్యేకమైన వస్త్రాలను భారతదేశ నలుమూలల నుండి పొందవచ్చు. ప్రతి స్టాల్ ఒక ప్రత్యేక రాష్ట్రపు కళా సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ ప్రదర్శనలో పాల్గొని భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదించండి” అంటూ తెలిపారు. ఇకపోతే ఈ ఎగ్జిబిషన్ ఆగస్టు 25 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఎగ్జిబిషన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మగువలు మెచ్చే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పట్టుచీరలను అతి సరళమైన ధరలకే సొంతం చేసుకోవచ్చు.
ALSO READ:U&I Retail Store: రిటైల్ స్టోర్ ప్రారంభోత్సవంలో మెరిసిన నభా నటేష్!