Blinkit New Feature: భారతదేశంలో ఇ-కామర్స్ రంగంలో నిమిషాల్లో డెలివరీ సేవల ప్రాధాన్యం పెరుగుతోంది. కొత్త కంపెనీలు ప్రవేశిస్తూ, వినియోగదారుల సంఖ్య, వ్యాపారం, పెట్టుబడులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇక తాజాగా ఈ రంగంలో ముందంజలో ఉన్న బ్లింకిట్ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ సౌకర్యమే పేరెంటల్ కంట్రోల్. దీని వల్ల యాప్ ఉపయోగించే అనుభవం మరింత రహస్యంగా, ఎవరికీ కనిపించకుండా ఉండేలా మారనుందని బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధింద్సా తన ఎక్స్ వేదికగా ప్రకటించారు.
తాజాగా యాప్‌లో చేరిన ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు కొన్ని పర్సనల్‌గా ఆర్డర్ చేసిన వాటిని దాచుకోవచ్చు. ఉదాహరణకు.. లైంగిక ఆరోగ్యానికి సంబంధించి విటమిన్స్, నికోటిన్ ఉత్పత్తులు అంటే.. సిగరెట్లు, సిగార్స్, తంబాకూ, పాన్ మసాలా ఉత్పత్తులు లాంటివి కనిపించవు. ఒకసారి పేరెంటల్ కంట్రోల్ సెట్ చేస్తే, ఈ ఉత్పత్తులు సెర్చ్ ఫలితాల్లో కనిపించవు. ఈ ఫీచర్ ప్రత్యేకంగా తక్కువ యువతకు దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. పిల్లలు యాప్‌ను ఉపయోగించినప్పుడు అలాంటి సెన్సిటివ్ ఐటమ్స్ వారికి కనిపించకుండా చేస్తుంది. అంతేకాకుండా, వీటిని యాక్సెస్ చేయడానికి 6 అంకెల పిన్ అవసరం. అలాగే రికవరీ కోసం ఒక ఫోన్ నంబర్ కూడా సెట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే మనం ఫోన్ లాక్ ఎలా చేసుకుంటా అచ్చం అలాగే వాడుకోవచ్చు. మనం పిన్ నెంబర్ ఎంట్రీ చేస్తేనే సెన్సిటివ్ ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి. లాక్ చేస్తే దానిని ఎవరూ ఓపెన్ చేసే ఛాన్స్ ఉండదు.
Also Read: Protest Against D-Mart: డిమార్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన, ఇదేం కొత్త పంచాయితీ సామీ!
ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఎవరైనా ఈ సెట్టింగ్స్ మార్చినా, యాప్ వెంటనే నోటిఫికేషన్ పంపుతుంది. అంటే గోప్యత, భద్రత రెండింటికీ పూర్తి రక్షణ లభిస్తుంది. పిల్లలు మాత్రమే కాకుండా, బంధువులు లేదా ఇంట్లోని ఇతరులు యాప్ ఉపయోగించినా ఆర్డర్ హిస్టరీ పూర్తిగా సేఫ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ లాంటి పోటీదారులు ఇలాంటి పేరెంటల్ కంట్రోల్ ఫీచర్‌ను అందించలేదు. కాబట్టి ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన మొదటి క్విక్ కామర్స్ యాప్‌గా బ్లింకిట్ నిలిచింది.
మొత్తం మీద, ఈ చిన్న ఫీచర్ వినియోగదారుల ప్రైవసీని కాపాడటమే కాకుండా, బ్లింకిట్‌కు పోటీలో ప్రత్యేకమైన ఆధిక్యం తీసుకొచ్చింది. దీనివల్ల యువతకు బ్లింకిట్ రాబోయే రోజుల్లో మరింత ఉపయోగకరంగా మారనుంది . BNP ప్రకారం, 2024-25లో 8.2 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత క్విక్ కామర్స్ మార్కెట్ 2027-28 నాటికి 30 బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఫ్యూచర్ నిజంగానే యువతకు ఉపయోగపడితే బ్లింకిట్‌ను ఉపయోగించేవారు వేలల్లో కాదు లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది.
We have introduced parental controls on the Blinkit app.
You can now go into your profile and hide sensitive items behind a PIN and also set up a recovery phone number. This will allow younger ones in the family to browse the app without seeing any age inappropriate products.… pic.twitter.com/G1CRCSowYZ
— Albinder Dhindsa (@albinder) August 19, 2025