E-Paper
Advertisement

పోలీస్ గా సాయి పల్లవి..స్పెషల్ పాత్రలో రేణు దేశాయ్.. ‘ఓం’తెలుగు ట్రైలర్ చూశారా?

పోలీస్ గా సాయి పల్లవి..స్పెషల్ పాత్రలో రేణు దేశాయ్.. ‘ఓం’తెలుగు ట్రైలర్ చూశారా?
Advertisement

OM Movie Trailer:లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సాయి పల్లవి (Sai Pallavi) ఇప్పటివరకు క్యారెక్టర్ ఓరియెంటెడ్ సినిమాలనే ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తొలిసారి ఈమెతో ఫైట్స్ చేయించిన ఘనత డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియాసామీకే దక్కుతుంది అని చెప్పాలి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush ) హీరోగా తెరకెక్కుతున్న ‘ఓం’ అనే చిత్రంలో సాయి పల్లవి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అదిరిపోయే యాక్షన్ చేసింది . ఈ మేరకు తాజాగా విడుదల చేసిన తెలుగు ట్రైలర్లో సాయి పల్లవి యాక్షన్ పర్ఫామెన్స్ సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పవచ్చు.

ఓం తెలుగు ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టేసిన సాయి పల్లవి..

డైరెక్టర్ గా , నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న ధనుష్ నిర్మాతగా పలు సినిమాలు నిర్మిస్తూ మరింత ప్రేక్షక ఆదరణ అందుకుంటున్న విషయం తెలిసిందే. అలాంటి ఈయన ఇప్పుడు హీరోగా చేస్తూ నిర్మించిన చిత్రం ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ , కూలీలను పోలీసులు కాల్చేయడం వంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధనుష్ భార్యగా శ్రీ లీల నటించగా.. ఐపీఎస్ అధికారిగా సాయి పల్లవి కనిపించనుంది. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ ను నిర్మూలించడానికి అటు తమిళనాడు నుంచి ధనుష్ అండర్ కవర్ పోలీస్ గా.. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి సాయి పల్లవి పనిచేస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన తెలుగు ట్రైలర్లో చూపించారు . చివరికి ఎవరు ఏం తెలుసుకున్నారనేదే ఈ సినిమా కథలా మనకు ట్రైలర్లో కనిపిస్తోంది.

26 ఏళ్ల తర్వాత తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రేణు దేశాయ్..

Advertisement

ఇకపోతే ఇక్కడ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మరో ఆసక్తికరమైన అంశం తెర పైకి వచ్చింది. ఇందులో ప్రముఖ సీనియర్ హీరోయిన్ , పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renudesai) కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ట్రైలర్ ద్వారా రివీల్ చేశారు. 2000 సంవత్సరంలో వచ్చిన ‘జేమ్స్ పాండు’ చిత్రంలో తమిళ్ వెండితెరపై కనిపించి ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. దాదాపు మళ్లీ 26 ఏళ్ల తర్వాత ఓం చిత్రం ద్వారా తమిళ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోంది. ఇకపోతే ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఒక ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన మేకర్స్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 20వ తేదీన తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా కీలక పాత్ర పోషిస్తుండగా.. సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించారు.

also read:వసుంధర సీరియల్లో వసు అత్తగా నటిస్తున్న ఈమె స్టార్ కమెడియన్ కూతురని తెలుసా?

మారి 2 తర్వాత ఓం చిత్రంలోనే..

Advertisement

ఇకపోతే సాయి పల్లవి, ధనుష్ తొలిసారి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ మూవీ మారి 2 చిత్రంలో కలిసి నటించారు ..ఇక ఈ చిత్రం మారి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది ఇక ఇందులో రౌడీ బేబీ అనే పాట బ్లాక్ బాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అలా మారి 2 తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్లిద్దరూ ఓం చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. అందులో జంటగా నటించగా.. ఇందులో ధనుష్ కి భార్యగా శ్రీ లీల నటిస్తుండడం గమనార్హం . మరి ఈ సినిమా వీరిద్దరికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

 

Related News

మగాడి గొప్పతనం ఏంటో చెప్పే ‘ఛప్రి’.. టీజర్ చూశారా?

సింపుల్ లుక్‌తోనే గ్లామర్ ట్రీట్.. నెట్టింట హీట్ పెంచుతున్న బాలీవుడ్ యంగ్ హీరోయిన్!

సేవ్ వైజాగ్ అంటూ పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్!

ఒకవైపు పవన్.. మరోవైపు నాగ్.. అనిల్ రావిపూడి సినిమా ఎవరితోనో ?

హృతిక్‌తో విడాకులకు అసలు కారణం ఇదేనా? సుస్సానే కామెంట్స్ వైరల్!

బ్రేకప్ తర్వాత తమన్నా సంచలన కామెంట్స్.. ఆ అదృష్టవంతుడు ఎవరంటే?

క్యాన్సర్ ను జయంచిన వీరనారీమణులు..

Big Stories

Advertisement
×