Mythological Series: హిందూ పురాణాల్లో శివపార్వతుల ప్రేమకథకు ప్రత్యేక స్థానం ఉంది. పరమశివుడిని భర్తగా పొందాలని పార్వతీ దేవి చేసిన తపస్సు, ఆమె పట్టుదల, తన సంకల్పం, ఎదురైన పరీక్షలను అధిగమించిన తీరు ఎంతో ప్రత్యేకం. ఈ పౌరాణిక ఘట్టాన్నే అందమైన పాట రూపంలో ఆవిష్కరించింది ‘జబ్ జిద్ పర్ ఆ గయీ పార్వతి’ (Jab Zid Pe Aa Gayi Parvati). ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh) సినిమాలోని ఈ పాట విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో విశేషంగా ఆదరణ పొందింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే… పాపులర్ అయిన ‘జబ్ జిద్ పర్ ఆ గయీ పార్వతి’ పాట టైటిల్ తో ఏకంగా ఒక కొత్త వెబ్ సిరీస్ పుట్టుకొచ్చింది. మరి ఆ సిరీస్ కథ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అన్న వివరాల్లోకి వెళ్తే…
పార్వతీ దేవి, పరమశివుడి ప్రేమకథకు పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. శివుడిని భర్తగా పొందాలని పార్వతి దేవి చేసిన తపస్సు, ఆ ప్రయాణంలో ఎదురైన పరీక్షలు, ఆమె చూపించిన పట్టుదల ఎన్నో కథల్లో కనిపిస్తాయి. అలాంటి పౌరాణిక ఘట్టాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది ‘జబ్ జిద్ పర్ ఆ గయీ పార్వతి’ సిరీస్. పార్వతీ దేవి, శివుడిని ఒక్కటిగా చేసే ప్రేమకథే ఈ సిరీస్ కు ప్రధాన ఆకర్షణ. సతీదేవి దూరమైన తర్వాత శివుడు లోక వ్యవహారాలకు దూరంగా తపస్సులో మునిగిపోతాడు. మరోవైపు హిమవంతుడు, మేనాదేవి కుమార్తెగా పార్వతి జన్మిస్తుంది. చిన్నప్పటి నుంచే శివుడిపై భక్తి, ప్రేమ కలిగిన పార్వతి… ఆయననే తన భర్తగా పొందాలని నిర్ణయించుకుంటుంది.
అయితే శివుడిని వివాహం చేసుకోవడం అంత సులభం కాదు. ఆయనను పొందేందుకు పార్వతి కఠినమైన తపస్సు చేయాల్సి వస్తుంది. శివుడి జీవనశైలి, ఆయన వైరాగ్యం గురించి చెప్పి పార్వతిని ఆ నిర్ణయం మార్చుకోవాలని సప్తర్షులు ప్రయత్నిస్తారు. కానీ ఆమె వెనక్కి తగ్గదు. తన ప్రేమపై నమ్మకంతో తపస్సును కొనసాగిస్తుంది. ఈ కథలో శివుడి వైరాగ్యం ఒకవైపు, పార్వతి దేవి పట్టుదల మరోవైపు కనిపిస్తాయి. ప్రేమ కోసం ఆమె పడే కష్టం, శివుడి మనసును గెలుచుకునే ప్రయాణం, చివరకు వారి కలయిక చుట్టూ పౌరాణిక కథనం సాగుతుంది. భక్తి, ప్రేమ, త్యాగం, పట్టుదల వంటి అంశాలు ఈ కథలో ప్రధానంగా కనిపిస్తాయి.
ఈ సిరీస్ హిందీలో జియోహాట్‌స్టార్‌లో అక్టోబర్ 26 నుంచి అందుబాటులో ఉంది. అయితే తెలుగులో డబ్బింగ్ వెర్షన్ లేదు. కాబట్టి తెలుగు ఆడియో అందుబాటులో ఉందని నిర్ధారించలేం. శివపార్వతుల పురాణగాథలు, పౌరాణిక సీరియల్స్‌ను ఇష్టపడేవారు డోంట్ మిస్. ఈ సిరీస్ గురించి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది పూర్తిగా కొత్త కథతో రూపొందిన సిరీస్ కాదు. గతంలో ప్రేక్షకాదరణ పొందిన ‘’evon Ke Dev… Mahadev’ అనే పౌరాణిక టీవీ సిరీస్ ను కొత్త పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆ సిరీస్ లో శివుడిగా మోహిత్ రైనా (Mohit Raina), పార్వతిగా సోనారికా భడోరియా (Sonarika Bhadoria), సతీదేవిగా మౌనీ రాయ్ (Mouni Roy), పార్వతి పాత్రలో పూజా బోస్ (Pooja Bose) నటించారు. ఈ పాత్రలు అప్పట్లో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి.
Read Also: చావును కూడా పండుగలా మార్చే అద్భుతమైన వేడుక… ఓటీటీలోకి వచ్చిన ఈ మెక్సికన్ సంప్రదాయాన్ని చూశారా ?