Cyclone Arnab: అర్నబ్ తుపాన్ వలన రాష్ట్రంలో జరిగిన నష్టాలపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసిందని అన్నారు. రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల వైపు తుపాను కదిలిందని, తుపాను తీవ్రతను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టామని అన్నారు. మూడు రోజులుగా నిరంతరం తుపాను పరిస్థితులపై సమీక్షలు నిర్వహించామని అన్నారు. మూడు రోజుల్లో ఎనిమిది సమీక్షలు నిర్వహించామన్నారు.
కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, పోలీసు, విపత్తు నిర్వహణ బృందాలతో నిరంతర సమన్వయం చేసామని, అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశామన్నారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేసామని, ప్రాణనష్టం పూర్తిగా నివారించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా కల్పించాలన్నారు.
ప్రజలను అన్ని విధాలా కాపాడటమే ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వ యంత్రాంగానికి తుపాను సహాయక చర్యలే అత్యంత ప్రాధాన్యం అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ, వార్డు స్థాయి సిబ్బంది వరకు సహాయక చర్యల్లో భాగస్వామ్యం అయ్యామని, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందుగా ప్రజలను రక్షించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. బాధితులకు కనీస అవసరాలు కల్పించేందుకు పునరావాస శిబిరాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Also read: చలికాలం స్పెషల్.. మార్కెట్లోకి ఇంటెక్స్ సరికొత్త ‘గీజర్లు’.. బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లు!
ప్రాణరక్షణ, భద్రత, సహాయక చర్యలు, పునరావాసమే లక్ష్యంగా ముందుకు వెళ్లామని, తుపాను బాధితులకు చివరి వరకు న్యాయం చేయడమే మా ఉద్దేశం అని సీఎం అన్నారు. పంటలు, ఆస్తులు, ఇళ్లు నష్టపోయిన వారిని ఆదుకుంటామన్నారు. పేదలకు అండగా నిలిచి.. మళ్లీ కోలుకునేలా చేయూతనిస్తామని, తుపాను సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు సీఎం తెలిపారు. గతంలో ఎన్నో తుపానులను చూశాం.. అనుభవాలతో విపత్తుల నిర్వహణలో మెరుగుదలపడ్డామని, గతంలో సరైన సన్నద్ధత లేకపోవడంతో భారీగా ప్రాణనష్టం జరిగేదని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ముందస్తు సన్నద్ధతతో విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం పెరిగిందని అన్నారు.
గతంలో గంటకు 220–230 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులను కూడా ఎదుర్కొన్నామని, తిత్లీ, అర్నబ్ వంటి తుపాన్ల ప్రభావాన్ని చాలా వరకు నియంత్రించగలిగామన్నారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తుపాను కారణంగా ఐదుగురు మృతి చెందడం బాధాకరం ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చినా కొందరు నిర్లక్ష్యంగా బయటకు రావడం దురదృష్టకరం అని సీఎం చంద్రబాబు తెలిపారు.
విద్యుత్ తీగలపై చెట్టు పడటంతో విశాఖలో ఒకరు మృతి చెందారని, విద్యుత్ స్తంభం కూలి విశాఖలో మరో వ్యక్తి మృతి, భీమవరంలో తాటిచెట్టు పడటంతో ఒకరు, అనకాపల్లిలో విద్యుత్ ప్రమాదంతో ఒకరు మృతి చెందారు. వీరితో పాటుగా సఖినేటిపల్లిలో ఇంటి గోడ కూలి ఒకరు మృతి చెందగా.. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
Also read: చింతపండు రోటి పచ్చడి..ఇలా చేస్తే రుచి ఎప్పటికీ మర్చిపోలేరు!
మత్స్యకారులకు, చేపల చెరువులకు సాయం చేస్తామని అన్నారు. దెబ్బతిన్న వలల మరమ్మతులకు రూ.5 వేల సాయం. కొత్త వలలు కొనుగోలుకు రూ.10 వేల పరిహారం చెల్లిస్తామని అన్నారు. వలలతో సహా పూర్తిగా దెబ్బతిన్న మోటారు లేని పడవలకు రూ.27 వేల సాయం వలలతో సహా పూర్తిగా దెబ్బతిన్న ఫిషింగ్ బోట్లకు రూ.25 వేల పరిహారం చెల్లిస్తామని అన్నారు. చేపల చెరువుల పునరుద్ధరణకు రూ.17 వేల సాయం. దెబ్బతిన్న షెడ్లకు రూ.25 వేల పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు.
ఆవు మృతి చెందితే రూ.50 వేల పరిహారం చెల్లిస్తామని, గేదె మృతికి రూ.40 వేల సాయం అందిచనున్నారు. దూడ మృతికి రూ.25 వేల పరిహారం. గొర్రె, మేక మృతికి రూ.7,500 సాయం. కోళ్లు మృతి చెందితే ఒక్కో పక్షికి రూ.100 చొప్పున పరిహారం చెల్లించనున్నారు. దీంతో పాటుగా కోళ్లకు సంబంధించి ఒక్కో లబ్ధిదారుకు గరిష్ఠంగా రూ.10 వేల సాయం. దెబ్బతిన్న క్యాటరింగ్ షెడ్లకు రూ.5 వేల పరిహారం. బ్యాటరీ షెడ్ల నష్టానికి రూ.500 సాయం చెల్లింస్తామని చద్రబాబు తెలిపారు.
తుఫాన్ ఎఫెక్టుకు పలు పంటలకు నష్టం ఆధారంగా హెక్టారుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పరిహారం చెల్లిస్తామని సీఎం తెలిపారు. అరటి, పసుపు, యామ్ వంటి పంటలకు హెక్టారుకు రూ.35 వేల సాయం. తమలపాకుల తోటలకు హెక్టారుకు రూ.75 వేల పరిహారం అందిచనున్నారు. మిరప, బొప్పాయి, టమాటా, ఉల్లి పంటలకు హెక్టారుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు సాయం అందిచనున్నారు. మామిడి, నిమ్మ, దానిమ్మ, సపోటా, జీడిమామిడి తోటలకు హెక్టారుకు రూ.35 వేల పరిహారం. కాఫీ, డ్రాగన్ ఫ్రూట్ తోటలకు హెక్టారుకు రూ.35 వేల సాయం. కూరగాయలు, పుచ్చకాయలు, నర్సరీలకు హెక్టారుకు రూ.25 వేల పరిహారం. టపియోకా పంటకు హెక్టారుకు రూ.10 వేల సాయం. ఆయిల్ పామ్, కొబ్బరి చెట్ల నష్టానికి ఒక్కో చెట్టుకు రూ.15 వేల పరిహారం. పంటలు, వృత్తులు, ఆస్తుల నష్టాలకు పరిహారం అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పరిహారం పంపిణీలో పారదర్శకత పాటించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
Also read: టాటా గ్రూపును నాశనం చేశారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యల వెనుక