Satya Kumar Yadav: కడప రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అమరావతిలో మీడియా ముందుకు వచ్చిన వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కడపలో పరిస్థితులు ఎదురుతిరగడంతోనే జగన్ మళ్లీ హింసాత్మక రాజకీయాలకు తెరలేపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
నామినేషన్ల వేళ దాక్కుని.. ఇప్పుడేమో సవాళ్లా?
గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాల పేరుతో వైసిపి శ్రేణులు రకరకాల అక్రమాలకు, అరాచకాలకు పాల్పడ్డాయని సత్యకుమార్ గుర్తుచేశారు. ‘నామినేషన్లు వేసే సమయంలో తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమైన జగన్, విత్‌డ్రాయల్స్ సమయంలో పూర్తిగా ముఖం చాటేశారు. అన్నీ పూర్తయ్యాక ఇప్పుడు వచ్చి చొక్కా మడతపెట్టి మాట్లాడటంలో ఆంతర్యమేంటి?’ అని ఘాటుగా నిలదీశారు.
పోలింగ్ నాడు అల్లర్లకు ప్లాన్?
పోలింగ్ రోజున శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకే జగన్ తన వ్యాఖ్యలతో వాతావరణాన్ని రెచ్చగొడుతున్నారని మంత్రి ఆరోపించారు. జగన్ ప్రవర్తన ఆయనలోని ఓటమి భయాన్నే ప్రతిబింబిస్తోందన్నారు. సవాలు విసిరిన జగన్ అసలు పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిని ధైర్యంగా ప్రకటించగలరా అని ప్రశ్నించారు.
జగన్‌కు 10 ప్రశ్నల సవాలు
ఈ సందర్భంగా జగన్ వైఖరిని ఎండగడుతూ 10 ఘాటు ప్రశ్నలను మంత్రి సత్యకుమార్ యాదవ్ సంధించారు. ప్రజాస్వామ్యాన్ని బలితీసుకునేలా ప్రవర్తిస్తున్న జగన్‌రెడ్డి లాంటి హింసావాదులకు ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన స్పష్టం చేశారు.
Also Read: బస్సు ఆపలేదని డ్రైవర్‌ను చితకబాదిన యువకులు.. వీడియో వైరల్