Nayanthara:లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార (Nayanathara ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈమె.. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. ఇంకా హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోలకు సమానంగా ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అలాంటి ఈమె ఖాతాలో మరో అరుదైన ఘనత వచ్చి చేరింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా ఒక సినిమా విడుదలవుతోంది అంటే థియేటర్ల వద్ద ఆయా సినిమాల హీరోలకు సంబంధించి పెద్ద పెద్ద కటౌట్లతో అభిమానులు సందడి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు మనం కేవలం హీరోల భారీ కట్ అవుట్లను మాత్రమే చూసాం. అయితే ఇప్పుడు ఈ జాబితాలో తొలిసారి భారీ కటౌట్ కలిగి ఉన్న హీరోయిన్ గా నయనతార రికార్డు సృష్టించింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. నయనతార లేడీ ఓరియంటెడ్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మూకుత్తి అమ్మన్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అటు తమిళ్, ఇటు తెలుగులో బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా మూకుత్తి అమ్మన్ 2 నవంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో మహాశక్తి పేరిట రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ తో అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇందులో రెజీనా కసాండ్రా కీలక పాత్ర పోషిస్తూ ఉండడం గమనార్హం.
ఇకపోతే ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు చెన్నైలోని వేల్స్ థియేటర్ బయట ఏకంగా 60 అడుగుల భారీ కటౌట్ ను పెట్టారు. నయనతార అమ్మవారి రూపంలో ఉన్న కటౌట్ ను ఏర్పాటు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . హీరోయిన్ కి ఇన్ని అడుగుల కటౌట్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. దీంతో నయనతార 60 అడుగుల కటౌట్ వైరల్ గా మారింది. మొత్తానికైతే ఆమె ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి ఈ విధంగా ప్రచారం కల్పిస్తున్నారు అని చెప్పవచ్చు.
also read: వర్షిణి బ్లాక్ మెయిల్.. ఆట మొదలెట్టిన త్రిగుణ్.. బిగ్ బాస్ ఏం జరుగుతోంది?
తమిళ్ ఫాంటసీ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరల్డ్ ఆఫ్ మహాశక్తి గా పిలువబడుతున్న ఈ చిత్రాన్ని దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. 2020లో వచ్చిన ఫ్రీక్వెల్ కి ఆర్ జే బాలాజీ దర్శకత్వం వహించగా.. ఆయన స్థానంలో ఈ సీక్వెల్ కి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఇషారి కే గణేష్, వెల్త్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజ సంగీతం అందిస్తుండగా.. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. పైగా 2 గంటల 25 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రెజినా కసాండ్రా ప్రతి నాయకురాలిగా నటిస్తుండగా.. ఊర్వశి, యోగిబాబు, దునియా విజయ్, అభినయ , కుష్బూ సుందర్, స్నేహ, మైనా , నందిని, గరుడా రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.