BigTV English

Periods: పీరియడ్స్ సమయంలో పెరుగు తినడం మంచిది కాదా? ఏం జరుగుతుంది?

Periods: పీరియడ్స్ సమయంలో పెరుగు తినడం మంచిది కాదా? ఏం జరుగుతుంది?

కొన్ని ఆహార పదార్థాలు తిన్న వెంటనే శరీరంపై ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే హార్మోన్ల స్థాయిలను కూడా ప్రభావితం చేస్తాయి. పీరియడ్స్ సమయంలో పెరుగు తినడం, లేదా ఊరగాయలు వంటివి తినడం వల్ల రక్తస్రావం ప్రభావితం అవుతుందేమోనని ఎంతోమంది మహిళలు భావిస్తూ ఉంటారు. అయితే ఏదైనా ఆహారం ఋతుప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పడానికి ఇప్పటివరకు సైన్స్ పరంగా ఎలాంటి ఆధారాలు లేవు. పెరుగు లేదా ఊరగాయ ఏది తిన్నా కూడా పీరియడ్స్ లో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.


కొన్ని ఆహార పదార్థాలు తినగానే రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచడం లేదా తగ్గించడం వంటివి చేస్తాయి. దీనికి శాస్త్రీయపరంగా కూడా ఆధారాలు ఉన్నాయి. అలాగే కొన్ని రకాల ఆహారాలు హార్మోన్ల హెచ్చుతగ్గులపై కూడా ప్రభావితం చేస్తాయి. ఇది కూడా నిజమేనని సైన్స్ చెబుతోంది. ఇలా హార్మోన్లు స్థాయిలపై ప్రభావం చూపిస్తే ఆ ప్రభావం పీరియడ్స్ పై పడే అవకాశం అయితే ఉంటుంది. ఆ విషయంలో అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పెరుగు లేదా ఊరగాయ వంటివి హార్మోన్ల స్థాయిలను ఎలాంటి ప్రభావితం చేయవు. కాబట్టి ఈ రెండింటిని హ్యాపీగా తినవచ్చు.

నిజానికి పీరియడ్స్ సమయంలో పెరుగు తినడం చాలా అవసరం. పెరుగులో ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు, క్యాల్షియం, పాలలో ఉండే కొవ్వు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి బహిష్టు సమయంలో పెరుగుని తినడం వల్ల మీకు శరీరానికి కాల్షియం అందుతుంది. ఆందోళన, మానసిక సమస్యలు, డిప్రెషన్ వంటివి రాకుండా ఉంటాయి.


పెరుగులో ఉండే క్యాల్షియం, ప్రోటీన్ కారణంగా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి, తిమ్మిరి వంటివి కూడా తగ్గుతాయి. పెరుగు తినడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు పెరుగుతాయని కొంతమంది అంటూ ఉంటారు. పెరుగులో కొవ్వు అధికంగా ఉంటుంది. పొట్ట సంబంధిత సమస్యలను ఇది పెంచుతుందని చెప్పుకుంటారు. అయితే మితంగా పెరుగును తినడం వల్ల ఎలాంటి సమస్య రాదు. అయితే పాలు వల్ల అలర్జీ ఉన్నవారు మాత్రం పెరుగు కూడా దూరంగా ఉండాలి. లేకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

పెరుగు ఎప్పుడు తినకూడదు?
కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా పెరుగును ఆ సమయంలో తగ్గిస్తే మంచిది. ఎందుకంటే పెరుగులో సోడియం ఉంటుంది. ఇది ఉబ్బరాన్ని పెంచేస్తుంది. మీకు పీరియడ్స్ సమయంలో పొట్ట ఉబ్బరంగా అనిపిస్తే పెరుగును దూరం పెట్టండి. మీకు నొప్పి తీవ్రంగా లేకపోతే పెరుగును తినవచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో కాకుండా మితంగానే తినండి. మీకు విపరీతమైన కడుపునొప్పి ఉంటే మాత్రం పెరుగును తినడం మానేయాలి.

Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. క్షణాల్లోనే పంటి నొప్పి మాయం

పీరియడ్స్ సమయంలో కొందరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాంటివారు పెరుగు తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. పెరుగులో క్యాల్షియం ఉంటుంది. ఇది కండరాలను రిలాక్స్ చేస్తుంది. అలాగే ప్రోబయోటిక్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జీర్ణవ్యవస్థకు ఎంతో అవసరం. పెరుగులో విటమిన్ బి12 ఉంటుంది. ఇది మన శరీరానికి శక్తిని అందిస్తుంది. అలాగే ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతతో పోరాడేందుకు సహాయపడుతుంది. పెరుగు తినడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది. కాబట్టి రోజుకో పెరుగు కప్పు పెరుగు తినడం ఎంతో మంచిది. పెరుగును పోషకాహారంగానే చెప్పుకుంటారు. దీనిలో ప్రోటీన్ నిండుగా ఉంటుంది. ప్రతిరోజు పెరుగు తినేవారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. వారికి మానసికపరంగా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Related News

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Big Stories

×