BigTV English
Advertisement

Pragya Nagra: ప్రైవేట్ వీడియో లీక్.. స్పందించిన హీరోయిన్

Pragya Nagra: ప్రైవేట్ వీడియో లీక్.. స్పందించిన హీరోయిన్

Pragya Nagra: డీప్ ఫేక్.. ప్రస్తుతం హీరోయిన్స్ పాలిట ఇది శాపంగా మారిపోయింది.  ఈ టెక్నాలిజీ వచ్చిన తరువాత హీరోయిన్స్ ప్రశాంతంగా నిద్రకూడా పోలేకపోతున్నారు. ఎప్పుడు ఏ వీడియోను డీప్ ఫేక్ చేస్తారో అని గుండెలను గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ రష్మిక ఇలాంటి డీప్ ఫేక్ బారిన పడి ఎంత చిత్రవధ అనుభవించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


న్యూడ్ వీడియోస్, ఇంటిమేటెడ్ వీడియోస్ లో ముఖాలు మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో హీరోయిన్స్ లీక్డ్ వీడియోలు అంటూ ప్రచారం చేస్తున్నారు. దీనివలన ఎంతోమంది నటీమణులు డిప్రెషన్ కు గురవుతున్నారు. తాజాగా  మరో హీరోయిన్ ఈ డీప్ ఫేక్  బారిన పడింది. మలయాళ నటి ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియో ఒకటి  సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెల్సిందే.

Samantha: రొమాంటిక్ సినిమాలు వద్దు.. తేల్చిచెప్పేసిన సమంత


బట్టలు లేకుండా ఆమె.. తన ప్రియుడుతో రొమాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోను ఎవరు లీక్ చేశారో తెలియదు కానీ.. అందరు అందులో ఉన్నది ప్రగ్యా అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దీనివలన ప్రగ్యా పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక తాజాగా ఈ వీడియోపై ప్రగ్యా స్పందించింది.  అందులో ఉన్నది తాను కాదని, అది డీప్ ఫేక్ అని క్లారిటీ ఇచ్చింది. “ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాను. నిద్రలో నుంచి  లేచి ఇదొక చెడ్డ కల అయితే బావుండు అనిపిస్తుంది. సాంకేతికత మనకు సహాయం చేయడానికి ఉపయోగపడాలి కానీ మన జీవితాలను దుర్భరంగా మార్చకూడదు. అటువంటి AI కంటెంట్‌ని సృష్టించడానికి దానిని దుర్వినియోగం చేసే దుష్ట మనస్సులు, దానిని వ్యాప్తి చేయడంలో సహాయపడే వ్యక్తుల పట్ల జాలి కలుగుతుంది. వీటన్నింటిలో బలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను.

Akkineni Naga Chaitanya: నా కొడుకును రేస్ ట్రాక్ కు తీసుకెళ్తా.. పిల్లల గురించి చై కామెంట్స్ వైరల్

ఈ క్షణాలలో నా కోసం ఉన్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరెవ్వరికీ ఇలాంటి కష్టాలు రాకూడదని, మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను మరియు ప్రార్థిస్తున్నాను ” అంటూ సైబర్ క్రైమ్ ను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ప్రగ్యా  పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇలాంటి వీడియోలు రాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ప్రగ్యా 2022లో తమిళ చిత్రం వరలారు ముక్కియం సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టింది. ఇక  2023లో నధికళిల్ సుందరి యమునా అనే మలయాళ చిత్రంతో అక్కడ అడుగుపెట్టింది. ఇవి రెండు మంచి విజయాన్ని అందుకున్నాయి.

Bold Movie In OTT : ఓటీటీలోకి వచ్చేసిన బో** మూవీ.. రొమాంటిక్ సీన్స్ చూస్తే ఇక అంతే..

ఇక ఈ ఏడాది ప్రగ్యా టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. సాయి రోనక్ – ప్రగ్యా నగ్రా జంటగా నటించిన చిత్రం లగ్గం. ఈ సినిమాకు రమేష్ చెప్పాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రగ్యాకు మంచి అవకాశాలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో  రెండు సినిమాలు ఉన్నాయని సమాచారం. మరి ఈ సినిమాలతో ఆమె  ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి. 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×