Amit Shah Discuss: ఏపీ రాజకీయాల్లో ఏం జరిగింది.. జరగబోతోంది? కాంగ్రెస్ వైపు జగన్ చూస్తున్నారా? ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో మంతనాలు చేస్తున్నారా? చర్చలు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చాయా? రాత్రి ఏపీకి వచ్చిన అమిత్ షా- చంద్రబాబు-పవన్ కల్యాణ్ మధ్య ఏం జరిగింది? జగన్ ప్యాలెస్‌ల గురించి ఎందుకు ఆరా తీశారు? ఇక జగన్ పనైపోయినట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది. కేవలం రెండు వారాల వ్యవధిలో ఏపీకి ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా రావడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఏపీ రాజకీయాల్లో ఏదో జరుగుతున్న చర్చ అప్పుడే మొదలైపోయింది. శనివారం రాత్రి ఏపీకి వచ్చిన అమిత్ షా, ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ముఖ్యమంత్రి ఇంటికి వచ్చారు. అక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
స్వతహాగా ఇద్దరు నాయకులు సమావేశమైతే రాజకీయాల గురించి మాట్లాడుకోవడం సహజం. చంద్రబాబు, పవన్ భేటీలో అమిత్ షా అదే అడిగారు. కాకపోతే తొలిసారి జగన్ ప్యాలెస్‌ల గురించి అమిత్ షా ఆరా తీయడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు, పవన్ భేటీలో అమిత్ షా కూడా అదే అడిగారు. కాకపోతే తొలిసారి జగన్ ప్యాలెస్‌ల గురించి అమిత్ షా ఆరా తీయడం ఆసక్తికరంగా మారింది.
బెంగుళూరు ప్యాలెస్ ఎన్ని ఎకరాలు? హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయ ఇళ్ల గురించి డీటేల్స్ వివరించారు. విశాఖలో కట్టిన ప్యాలెస్ గురించి నేతలు ప్రస్తావించినప్పుడు అది ప్రభుత్వం నిధులతో కట్టింది కదా అని అమిత్ షా అన్నారు. గతంలో అక్కడ టూరిజం శాఖకు చెందిన కాటేజీలు ఉండేవని, వాటిని కూల్చివేసి ఆ ప్యాలెస్‌ను కట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
ALSO READ: మీకు సొంతిల్లు లేదా? ఈ డబుల్ బొనాంజా ఆఫర్ మీకోసమే!
ఈ భవనం విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ కోట్లాది రూపాయలు ఫైన్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు ఏపీ పెద్దలు. ఎన్జీటీకి ఆ డబ్బు కట్టేశారా అని షా అడిగారు. ఇంకా లేదని, ఎన్జీటీ నిబంధనలు కఠినంగా ఉంటాయని లోకేష్ చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ ఎక్కువగా బెంగుళూరులో ఉంటున్నారని, అప్పుడప్పుడు తాడేపల్లి వచ్చి మీడియాతో మాట్లాడి వెళ్లిపోతున్న విషయాన్ని గుర్తు చేశారు నేతలు. ఈ విషయాన్ని ఏపీలోని ప్రధాన పత్రికలు ప్రస్తావించాయి.
ఢిల్లీ పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్న ప్రచారం మేరకు.. ఈ మధ్యకాలం కాంగ్రెస్ పెద్దలతో జగన్ సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో వైసీపీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ఇప్పుడు ఈ విషయం బయటపడితే తనకు లేనిపోని ఇబ్బందులు వస్తాయని, ఎన్నికలకు ముందు రివీల్ చేస్తే బాగుంటుందని జగన్ అన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ పార్టీ పరంగా కాస్త స్లో కావడం, షర్మిల దూకుడు ప్రదర్శించడం వెనుక ఇదే కారణమని అంటున్నారు కొందరు నేతలు. ఇదే విషయమై గతంలో షర్మిలను మీడియా ప్రశ్నించిన విషయం తెల్సిందే. ఈ లెక్కన రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చనే చర్చ జోరుగా సాగుతోంది.
చంద్రబాబు నివాసానికి చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో అమిత్ షా మాటామంతీ https://t.co/6CrZXYWdSV pic.twitter.com/zWTdbikJKo
— BIG TV Breaking News (@bigtvtelugu) January 18, 2025