Food For Weight Gain: సన్నగా ఉండటం అనేది ఒక సమస్య. ఈ రోజుల్లో ఇది చాలా మందికి ఆందోళన కలిగించే అంశంగా మారింది. బరువు పెరగడానికి పరిష్కారాల కోసం ఎంతో మంది వెతుకుతూ ఉంటారు. వారిలో మీరు కూడా ఒకరయితే, బరువు పెరగాలని మీరు కోరుకుంటే, ఈ 8 ఆహారాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీ బరువును ఈజీగా పెంచుకోవచ్చు.
బరువు పెరగడానికి 8 ఆహారాలు:
గింజలు, విత్తనాలు:
బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు , పిస్తాపప్పులు వంటి గింజలను తీసుకోవడం వల్ల ఈజీగా బరువు పెరగవచ్చు. ఇవి అధిక కేలరీలు ఉన్న ఆహారాలు. అంతే కాకుండా ఇవి అధిక మొత్తంలో ప్రొటీన్‌లను కలిగి ఉండటం వలన మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. రోజు కొన్ని డ్రై ఫ్రూట్స్ తినండి. ఇది మీ బరువును పెంచడంలో సహాయపడుతుంది.
పాల ఉత్పత్తుల వినియోగం:
మీ రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు , చీజ్ వంటి పాల ఉత్పత్తులను చేర్చుకోండి. తద్వారా మీ శరీరానికి తగిన మొత్తంలో ప్రోటీన్ , కాల్షియం లభిస్తుంది. పాలు , పెరుగు తీసుకోవడం వల్ల మీ బరువు త్వరగా పెరుగుతుంది. మీరు పాలలో తేనె లేదా చాక్లెట్ పొడిని జోడించడం ద్వారా కూడా షేక్ చేసుకొని త్రాగవచ్చు. ఇది మీకు ఎక్కువ కేలరీలను ఇస్తుంది.
తృణధాన్యాలు:
వోట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలు బరువు పెరగడానికి మంచి మూలం. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. అంతే కాకుండా మీరు వాటిని సలాడ్ లేదా కూరగాయలతో కలపడం ద్వారా కూడా తినవచ్చు. ఇది మీకు అవసరమైన కేలరీలను ఇస్తుంది.
బంగాళదుంపలు, చిలగడదుంపలు:
ఈ రెండు ఆహారాలు మీ జీవక్రియను సక్రియం చేస్తాయి. అంతే కాకుండా ఉడకబెట్టిన బంగాళాదుంపలను రోజు తినడం వల్ల మీ బరువు పెరగడానికి సహాయపడుతుంది.
గుడ్లు:
రోజు గుడ్లు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. ఇది ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం. ఇది మీ బరువును పెంచే అన్ని ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటుంది. అమైనో ఆమ్లాలు గుడ్లలో ఉంటాయి. అందుకే వీటిని రోజు అల్పాహారం లేదా సలాడ్‌లో కలిపి తీసుకోవచ్చు. గుడ్లను ఉడికించి లేదా ఆమ్లెట్ లేదా స్టఫ్డ్ గుడ్లు వంటి వివిధ మార్గాల్లో కూడా తినవచ్చు.
ఫ్రూట్ షేక్:
ఫ్రూట్ షేక్ శక్తికి మంచి మూలం. ఫ్రూట్ షేక్ చేయడానికి మీరు అరటి, మామిడి లేదా స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఉపయోగించవచ్చు. వీటిని పాల ఉత్పత్తులతో కలిపి తాగవచ్చు. ఇది రుచిని పెంచడమే కాకుండా కేలరీల కంటెంట్‌ను కూడా పెంచుతుంది.
చికెన్ ,రెడ్ మీట్:
చికెన్ , రెడ్ మీట్ వంటి మాంసాహార ఉత్పత్తుల్లో ప్రోటీన్ , ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి సహాయపడతాయి. వీటిని గ్రిల్ చేయడం, ఉడకబెట్టడం లేదా ఆవిరిలో ఉడికించి తినండి. తృణధాన్యాలు లేదా ఆకుపచ్చ కూరగాయలు మాంసంతో తినండి.
Also Read: ఇవి తింటే.. వృద్దాప్యంలోనూ కంటి సమస్యలు రావు
ప్రొటీన్ రిచ్ ఆయిల్:
ఆలివ్ నూనె, కొబ్బరి నూనె లేదా వెన్న వంటి ఆరోగ్యకరమైన, అధిక-ప్రోటీన్ నూనెలను తీసుకోవడం ప్రారంభించండి. మీ ఆహారంలో వీటిని ఎక్కువగా ఉపయోగించండి. వీటిని తీసుకోవడం వల్ల మీ శరీరానికి ఎక్కువ కేలరీలు అందుతాయి. అంతే కాకుండా మీరు వీటిని సలాడ్లు, సూప్లు , కూరగాయలలో కూడా ఉపయోగించవచ్చు.