BigTV English

Artificial Blood: కృత్రిమ రక్తం ప్రయోగం సక్సెస్.. ఇక బ్లడ్ గ్రూప్స్‌తో పని లేదా?

Artificial Blood: కృత్రిమ రక్తం ప్రయోగం సక్సెస్.. ఇక బ్లడ్ గ్రూప్స్‌తో పని లేదా?

Blood : రక్తం. రక్తం. రక్తం. బ్లడ్ కొరతతో ప్రపంచ వ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది మరణిస్తుంటారు. కొన్ని దీర్ఘకాలిన రోగాలకు రెగ్యులర్‌గా డయాలసిస్ చేయాల్సిందే. యాక్సిడెంట్స్ జరిగినా, ఆపరేషన్స్ చేసినా.. రక్తం అవసరం ఎంతో. అయితే, డిమాండ్ మేరకు రక్తం అందుబాటులో లేదు. దాతల సంఖ్య చాలా తక్కువ. రక్తం ఇవ్వడానికి ఇప్పటికీ చాలామంది ముందుకు రావడం లేదు. అలాగని రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేం. మనిషి నుంచి మనిషికి మాత్రమే అందిచగలం. అందులోనూ ఏ బ్లడ్ గ్రూప్‌కు ఆ బ్లడ్ గ్రూప్ రక్తమే సరిపోద్ది. వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే విషంతో సమానం. అది మరో సమస్య. వో నెగటివ్ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం. రక్తంతో ఇలా అనేక ఇబ్బందులు. లెక్కలేనన్ని మరణాలు. ఇకపై అలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. జపాన్ సైంటిస్టులు కృత్రిమ రక్తాన్ని ల్యాబ్‌లో తయారు చేశారు. క్లినికల్ ట్రయల్స్ కూడా కంప్లీట్ చేశారు. త్వరలోనే ఆర్టిఫిషియల్ బ్లడ్ ప్రజలందరికీ అందుబాటులోకి రానుంది. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి….


ఆ బ్లడ్‌తో అనేక లాభాలు..

జపనీస్ బయోమెడికల్ శాస్త్రవేత్తలు కీలక పురోగతి సాధించారు. అన్నిరకాల బ్లడ్ గ్రూప్స్‌కు అనుకూలంగా ఉండే కృత్రిమ రక్తాన్ని తయారు చేశారు. అన్ని రకాల రోగులకు ల్యాబ్ మేడ్ రక్తాన్ని ఉపయోగించవచ్చు. ఏం కాదు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఆర్టిఫిషియల్ బ్లడ్‌తో మరిన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. రూమ్ టెంపరేచర్ దగ్గర ఏకంగా 2 సంవత్సరాల పాటు నిల్వ చేయొచ్చు. అప్పటి వరకు అస్సలు పాడవదు. ఫ్రిడ్జిలో పెట్టాల్సిన పని కూడా లేదు. నిల్వ చేయడం, రవాణా చేయడం అత్యంత సులభం. అత్యవసర పరిస్థితుల్లో ఈజీగా విదేశాలకు కూడా తరలించవచ్చు. భూకంపాలు, యుద్ధాలు లాంటి ఘటనలు జరిగితే కావాల్సినంతగా.. ఎన్ని యూనిట్ల బ్లడ్ అయినా సరఫరా చేయొచ్చు అంటున్నారు.


కృత్రిమ రక్తాన్ని ఎలా తయారు చేస్తారు?

ఎక్స్‌పైరీ అయిన డోనార్ రక్తం నుంచి హిమోగ్లోబిన్ సేకరించి కృత్రిమ రక్తాన్ని తయారు చేశారు జపాన్ సైంటిస్టులు. దాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. ఆ హిమోగ్లోబిన్ ఒక సేఫ్టీ షెల్‌తో కప్పబడి ఉంటుంది. వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్లు గట్రా సోకే ప్రమాదం కూడా ఉండదు. ప్యూర్ అండ్ ఆర్టిఫిషియల్ బ్లడ్ అన్నమాట. ఇందులో యాంటిజెన్స్‌ లేకపోవడం వల్ల.. అన్ని రక్త వర్గాలతో కలిసిపోతుంది. అందుకే కృత్రిమ రక్తాన్ని ఏ బ్లడ్ గ్రూపు వారికైనా అందించవచ్చని చెబుతున్నారు.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

కృత్రిమ రక్తంపై 2022 నుంచి జపాన్ సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ కూడా కంప్లీట్ చేశారు. ఎటువంటి దుష్ప్రభావాలు కానీ, సమస్యలు కానీ కనిపించలేదని అంటున్నారు. ఆ ఫలితాలు ఆర్టిఫిషియల్ బ్లడ్ అత్యంత సురక్షితం, ప్రభావవంతం అని ఫ్రూవ్ చేశాయని చెబుతున్నారు. అయితే, ఇది ప్రజలకు అందుబాటులోకి రావాలంటే మరో ఐదేళ్లు ఆగాల్సిందే. 2030 నాటికి పెద్ద మొత్తంలో ఉత్పత్తి, పంపిణీ చేపడతామని తెలిపారు జపాన్ పరిశోధకులు. అదే జరిగితే.. కృత్రిమ రక్తం తయారీ.. మెడికల్ ఫీల్డ్‌లో గేమ్ ఛేంజర్. వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైనట్టే.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×