Rashmika Mandanna: రష్మిక మందన్న(Rashmika Mandanna).. నేషనల్ క్రష్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఏ ముహూర్తాన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో తెలియదు కానీ అప్పటినుంచి సినీ ఇండస్ట్రీలో అంచలంచెలు ఎదుగుతూ.. చెరగని ముద్ర వేసుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే నేషనల్ క్రష్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. ‘ ఛలో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో ‘గీతాగోవిందం’ సినిమా చేసి మరింత క్రేజ్ దక్కించుకున్న ఈమె.. వారసుడు, ఆడవాళ్లు మీకు జోహార్లు, సరిలేరు నీకెవ్వరు, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలలో అవకాశాన్ని అందుకొని ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మూడేళ్లలోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక..
ఇకపోతే అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్(Sukumar ) కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించి, ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయింది రష్మిక. అంతేకాదు ‘పుష్ప 2’ లో తన పెర్ఫార్మెన్స్ తో అబ్బురపరిచింది. మొదటి పార్ట్ లో ప్రియురాలిగా, రెండవ భాగంలో భార్యగా అద్భుతంగా నటించి మెప్పించింది. అంతేకాదు బాలీవుడ్లో ‘ఛావా’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో మహారాణి పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆకట్టుకునే చీరకట్టు , బొట్టు.. అచ్చం మహారాణిలా కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇలా ఐదేళ్లలోనే తన సినిమాలతో రూ. 3000 కోట్లు రాబట్టి దీపికా పదుకొనే, ఐశ్వర్యరాయ్ లాంటి హీరోయిన్లను కూడా వెనక్కి నెట్టింది ఈ ముద్దుగుమ్మ.
ALSO READ:Shobha Shetty: సోషల్ మీడియాకు శోభాశెట్టి గుడ్ బై.. కారణం ఇదేనా?
పుష్ప మూడ్ నుంచి ఇంకా బయటపడలేదా?
ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియాలో తరచూ ఏదోక పోస్టు పెడుతూనే ఉంటుంది. సినిమాకు సంబంధించిన విషయాలు లేటెస్ట్ ఫోటోషూట్లతో పాటు వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక పోస్ట్ చూస్తే మాత్రం ఇంకా ఈమె ‘పుష్ప’ మూడ్ నుంచి బయటకు రాలేదేమో అనిపిస్తుంది. ఇది చూసిన నెటిజన్స్ ట్రెండ్ మారుతోంది. మేడం మీరు కూడా సినిమాలు చేస్తున్నారు కదా.. ట్రెండ్ కు తగ్గట్టు ఫాలో అవ్వండి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి రష్మిక పెట్టిన పోస్ట్ విషయానికి వస్తే.. తాజాగా జీ సినీ అవార్డ్స్ 2025 గురించి పోస్ట్ చేసింది. “జీ సినీ అవార్డ్స్ 2025 లో నా ప్రదర్శన, చిన్న చిన్న వీక్షణ మీకోసం. జూన్ 7వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు జీ సినిమా, జీ టీవీ అండ్ జీ5 లో మారుతి సుజుకి అందించే 23వ జీ సినీ అవార్డ్స్ 2025 లో నన్ను ప్రత్యక్షంగా చూడండి” అంటూ పుష్ప 2 లో “సూసెకీ అగ్గి రవ్వ మాదిరి” అనే పాటకు డాన్స్ చేస్తూ ఆ వీడియోని పంచుకుంటూ ఈ విషయాన్ని తెలిపింది రష్మిక. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
?utm_source=ig_web_copy_link