Pachikobbari Karam Podi Recipe: తెలుగు వారి భోజనంలో కారం పొడులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎప్పుడూ చేసుకునే సాధారణ కారం పొడులతో.. పోలిస్తే, తాజాగా తురిమిన పచ్చి కొబ్బరితో తయారు చేసే కొబ్బరి కారం పొడి రుచే వేరు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ ప చ్చికొబ్బరి కారం పొడితో తింటే ..అద్భుతంగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి టిఫిన్లలోకి నంజుకోవడానికి లేదా అన్నంలోకి కూడా ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్. బయట మార్కెట్లో దొరికే వాటికంటే.. శుభ్రమైన పదార్థాలతో ఇంట్లోనే స్వచ్ఛమైన పద్ధతిలో ఈ కొబ్బరి కారం పొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి కొబ్బరి తురుము: 2 కప్పులు
ఎండు మిర్చి: 10 నుంచి 12
ధనియాలు: 2 టేబుల్ స్పూన్లు
జీల కర్ర: 1 టీస్పూన్
మినప్పప్పు: 1 టేబుల్ స్పూన్
శనగ పప్పు: 1 టేబుల్ స్పూన్
చింత పండు: చిన్న నిమ్మకాయ సైజ్ అంత
వెల్లుల్లి రెబ్బలు: 8 నుండి 10
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: అర టీస్పూన్
1. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మినప్పప్పు, శనగ పప్పు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత ధనియాలు, జీల కర్ర, కరివేపాకు, ఎండు మిర్చి వేసి మంచి సువాసన.. వచ్చే వరకు తక్కువ మంటపై.. వేయించి పక్కన పెట్టు కోవాలి. మిర్చి మాడి పోకుండా.. చూసుకోవడం ముఖ్యం.
2.ఇదే ప్యాన్‌లో మరో స్పూన్ నూనె వేసి, ముందుగా.. తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేయాలి. కొబ్బరిలోని తడంతా పోయి, అది కొద్దిగా రంగు మారి మంచి సువాసన వచ్చే.. వరకు కలుపుతూ వేయించాలి. పచ్చి కొబ్బరిలో తడి ఉంటే పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి దీన్ని బాగా వేయించడం చాలా ముఖ్యం. ఆ తర్వాత దీనిని పూర్తిగా చల్లారబెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ..ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, చింత పండు, వెల్లుల్లి రెబ్బలు, తగి నంత ఉప్పు ,పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
Also Read: అమ్మమ్మ నాటి రుచితో పర్ఫెక్ట్ బెల్లం గవ్వలు..ఒక్కసారి ఇలా ట్రై చేయండి
3. ఆ తర్వాత అదే మిక్సీ జార్‌లో పూర్తిగా చల్లారిన పచ్చి కొబ్బరి తురుమును వేయాలి. మిక్సీని పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేయాలి. కొబ్బరిని మరీ పేస్ట్‌లా కాకుండా, పొడిపొడిగా ఉండేలా చూసు కోవాలి. అంతే టేస్టీ టేస్టీ పచ్చికొబ్బరి కారం పొడి రెడీ!
ఈ పొడిలో పచ్చి కొబ్బరి వాడతాం కాబట్టి.. గాజు సీసాలో నిల్వ చేస్తే ఫ్రిజ్‌లో..ఉంచితే వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది.
కొబ్బరిని వేయించేటప్పుడు.. నీటి ఆవిరి పూర్తిగా ఆరి పోయేలా చూస్తే పొడి పాడవకుండా ఉంటుంది.