E-Paper
Advertisement

హెచ్‌ఐసీసీ భారత్ సమ్మిట్‌లో.. మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం!

హెచ్‌ఐసీసీ భారత్ సమ్మిట్‌లో.. మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం!
Advertisement

Social Justice: హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్‌లో తెలంగాణ రైసింగ్ సామాజిక న్యాయం అంశంపై జరిగిన ప్యానల్ డిస్కషన్‌లో మంత్రి సీతక్క మాట్లాడారు. తెలంగాణలోని ఓ మారుమూల ఆదివాసీ గ్రామం నుంచి వచ్చి నేడు మంత్రిగా మీ ముందున్నానని, అడవుల నుంచి శాసనసభ వరకు సాగిన నా ప్రయాణం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, విద్య, ప్రజాసేవలతో కూడుకున్నదని అన్నారు. ఒకప్పుడు లాయర్ అవుతానని, పీహెచ్‌డీ చేస్తానని, శాసనసభలో మంత్రిగా నిలబడతానని కూడా ఊహించలేదు. నా లాంటి మారుమూల గ్రామాల్లో ఎంతోమంది అమ్మాయిలకు ఎన్నో కలలున్నాయి. కానీ వారికి అవకాశాలు దక్కడం లేదని అన్నారు.

నేను అనుభవించిన పోరాటం..

ప్రతిభ ఉన్న పిల్లలు వెనుకబడటానికి కారణం వారి సామర్థ్యం లేకపోవడం కాదు.. సమాజం వారికి తగిన అవకాశాలు కల్పించకపోవడమేనని, సామాజిక న్యాయం అనేది నాకు కేవలం అకడమిక్ అంశం కాదు.. నేను అనుభవించిన పోరాటం.. నేడు నాపై ఉన్న బాధ్యత అని మంత్రి సీతక్క అన్నారు. సామాజిక న్యాయం అంటే ప్రతి ఒక్కరికీ గౌరవం, ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు కల్పించడం అని దరూ ఒకే స్థాయి నుంచి ప్రయాణం ప్రారంభించరు.. కొందరికి వారసత్వంగా అవకాశాలు వస్తే, మరికొందరు తరతరాలుగా వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు.

Advertisement

Also Read: ‘భోగాపురంపై హ్యాపీగా లేను.. అది జరిగిన రోజు ఎంతో సంతోషిస్తా’.. రానాతో లోకేశ్ కీలక వ్యాఖ్యలు!

సమాజంలో..

దిరా మహిళా శక్తి భవనాల ద్వారా గ్రామీణ మహిళలకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తున్నామని, మహిళలు అవకాశాల కోసం గ్రామాలను వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు.. అవకాశాలే మహిళలు ఉన్న ప్రాంతాలకు చేరాలని అన్నారు. మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తున్న ‘జిత్నీ ఆబాదీ ఉత్నా హక్’ నినాదం సామాజిక న్యాయానికి పునాది అని అన్నారు. కులగణన సమాజంలో విభజనలు సృష్టించదు.. తరతరాలుగా కొనసాగుతున్న అసమానతలను వెలుగులోకి తెస్తుందని కులగణన అనేది భారతీయ సమాజానికి ఎక్స్‌రే లాంటిది. సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు దోహదపడుతుందని అన్నారు.

జూనియర్ అడ్వకేట్‌గా..

Advertisement

ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని నెల్సన్ మండేలా అన్నారు. పదో తరగతి తర్వాత చదువు ఆపి ఉద్యమంలోకి వెళ్లి తొమ్మిది నుంచి పదేళ్ల పాటు ఉద్యమ జీవితాన్ని గడిపాను. తిరిగి ప్రధాన స్రవంతిలోకి వచ్చి విద్యను కొనసాగించాను. నక్సలైట్ కేసులు విచారణ జరిగిన కోర్టులోనే న్యాయ విద్యను ప్రారంభించానని అన్నారు. ఐదేళ్ల తర్వాత అదే కోర్టులో జూనియర్ అడ్వకేట్‌గా అడుగుపెట్టి నక్సలైట్ నాయకుల కేసుల్లో వాదించానని, ఒకప్పుడు జూనియర్ అడ్వకేట్‌గా అడుగుపెట్టిన అదే ప్రదేశానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగి రావడం నా జీవిత ప్రయాణంలో మరిచిపోలేని ఘట్టం అని మంత్రి సీతక్క అన్నారు. దువును ఎప్పుడూ ఆపలేదు.. నిరంతరం జ్ఞానాన్ని సంపాదిస్తూ సమాజానికి తిరిగి సేవ చేస్తూనే ఉన్నాను. దే నా జీవిత ప్రయాణం.. ఇదే నా సామాజిక పోరాటం.. సమానత్వం, గౌరవం, సామాజిక న్యాయం సాధించే వరకు మన ప్రయాణం కొనసాగాలని అన్నారు.

Also read: హరీష్ రావును ఓడించడం పెద్ద విషయం కాదు.. సిద్దిపేటలో జెండా ఎగురవేస్తాం!- కవిత సంచలన వ్యాఖ్యలు

Tags

Related News

జీహెచ్ఎంసీకి ఏమైంది? ఆదాయం లేకపోయినా ఆ రెండు కార్పొరేషన్ల భారం ఎందుకు?

విద్యుత్ శాఖలో మీటర్ బైపాస్ కుంభకోణం.. జోరుగా డబ్బులు వసూల్!

హరీష్ రావును ఓడించడం పెద్ద విషయం కాదు.. సిద్దిపేటలో జెండా ఎగురవేస్తాం!- కవిత సంచలన వ్యాఖ్యలు

వీసీ సజ్జనార్ విషయంలో ఏం జరిగింది? 14 నెలలకే బదిలీ ఎందుకు? పోలీసు శాఖలో తీవ్రమైన చర్చ

తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌ని ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ముప్పు!

మోదీకి భజన చేసుకో.. అమిత్ షాకు పూజ చేసుకో..! కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ సెటైర్లు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి.. నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

Big Stories

Advertisement
×