E-Paper
Advertisement

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్… కింగ్డమ్ సీక్వెల్ లేనట్టే!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్… కింగ్డమ్ సీక్వెల్ లేనట్టే!
Advertisement

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో సరైన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఈయన చివరిగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్(King dom) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ద్వారా నిర్మాత నాగ వంశీ నష్టాలను కూడా ఎదుర్కొన్నారని చెప్పాలి. ఈ తరుణంలోనే ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా అనే సందేహం అందరిలోనూ ఉంది.

కింగ్డమ్ సీక్వెల్ కష్టమేనా?

తాజా సమాచారం ప్రకారం నాగవంశీ కింగ్డమ్ సినిమా సీక్వెల్ చేయాలనే ఆలోచనలో లేరని తెలుస్తోంది. ఇటీవల కాలంలో నాగ వంశీ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నష్టాలను చవిచూసిన నేపథ్యంలో ఈయన సీక్వెల్ సినిమాల ఆలోచనలో లేరని సమాచారం. దీంతో కింగ్డమ్ సీక్వెల్ ఆగిపోయిందని తెలుస్తోంది. మరి ఈ సినిమా సీక్వెల్ గురించి వస్తున్న వార్తలలో నిజం ఎంతవరకు ఉందనేది తెలియాలి అంటే నాగ వంశీ స్పందించాల్సి ఉంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో, విభిన్నమైన లుక్ లో విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలో కనిపించి సందడి చేశారు.

అంచనాలను చేరుకోలేకపోయిన కింగ్డమ్..

Advertisement

ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ భారీగానే కష్టపడ్డారని తెలుస్తుంది. అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం చేరుకోలేకపోయింది. విజయ్ దేవరకొండ ఇదివరకు నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ కావడంతో ఆ ప్రభావం కింగ్డమ్ సినిమాపై ఉందని చెప్పాలి. ఈ సినిమా సీక్వెల్ ఉండకపోవచ్చు అనే వార్తలు బయటకు రావడంతో విజయ్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుత సినీ కెరియర్ విషయానికి వస్తే ఈయన రవి కిరణ్ కోలాదర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

రష్మికతో వివాహం..

Advertisement

ఈ సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇలా వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే త్వరలోనే సినీ నటి రష్మిక మందన్నను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారని తెలుస్తుంది. ఫిబ్రవరి 26 న వీరిద్దరూ ఉదయపూర్ లో ఎంతో ఘనంగా వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ వార్తలపై ఎక్కడ అధికారిక ప్రకటన వెలువబడలేదు.

Also Read: Prabhas: ఏంటీ డార్లింగ్ లైఫ్ లో లవ్ లేదు…లవ్ స్పెల్లింగ్ అయినా కరెక్ట్ రాయొచ్చుగా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×