BigTV English

Kidney Cancer: కిడ్నీ కాన్సర్ బారిన పడకుండ ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

Kidney Cancer: కిడ్నీ కాన్సర్ బారిన పడకుండ ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

Kidney Cancer Symptoms, Signs, Causes & Treatment: ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. వివిధ రకాల క్యాన్సర్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మిలియన్ల మంది ప్రజలు మృతి చెందుతున్నారు. ఊపిరితిత్తులు, ఉదరం, రొమ్ము క్యాన్సర్‌లు వంటివి ఎక్కువగా నివేదించబడిన కేసులు. కిడ్నీ క్యాన్సర్ కూడా వేగంగా సంభవిస్తున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. కిడ్నీ కాన్సర్ అనేది అన్ని వయసుల వారికి సంభవిస్తుంది.


గ్లోబల్ క్యాన్సర్ సంస్థలు ప్రతి ఏడాది 400,000 కొత్త కిడ్నీ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని.. 1.75 లక్షల మందికి పైగా మరణిస్తున్నట్లు అంచనా వేశారు. 2020 సంవత్సరంలో 4.30 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. వృద్ధులలో కిడ్నీ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉన్నప్పటికీ, పెద్దలు కూడా ఈ కాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. యుక్తవయసులో కిడ్నీ క్యాన్సర్ చాలా అరుదు. అయితే సికిల్ సెల్ వ్యాధి వంటి పరిస్థితులు యువకులలో ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని తాజా నివేదికలు వెల్లడించాయి. కాబట్టి కిడ్నీ కాన్సర్ వ్యాధి లక్షణాలను ప్రతి ఒక్కరు తెలుసుకొని సరైన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అయితే కిడ్నీ కాన్సర్ ఎలా వస్తుందనేది వైద్యులకు కూడా అంతుచిక్కని ప్రశ్న. కొన్ని కణాలు డీఎన్‌ఏలో మార్పులు ఏర్పడటంతో కిడ్నీ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. ఇదే కాకుండా ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో తగిన జాగ్రత్తలు పాటించాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. కాన్సర్ సమస్యలు అనేవి వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఎక్కువగా కిడ్నీ కాన్సర్ అనేది ధూమపానం, మద్యం సేవించేవారిలో, ఊబకాయంతో బాధపడేవారు  కిడ్నీ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబంలో ఎవరైనా కిడ్నీ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లయితే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.


అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం, అనియంత్రిత అధిక రక్తపోటు మూత్రపిండాల క్యాన్సర్ తో సహా అనేక కిడ్నీ సంబంధిత వ్యాధులపై ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో చికిత్స కోసం చాలా కాలంగా డయాలసిస్ చేయించుకునే వ్యక్తులకు కూడా కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Also Read: టీ లేదా కాఫీ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?

కిడ్నీ కాన్సర్ లక్షణాలు..

కిడ్నీ క్యాన్సర్ ప్రారంభ దశల్లో సాధారణంగా ఎలాంటి లక్షణాలు కాని సంకేతాలు కాని ఉండవు. అయితే రోజులు గడిచేకొద్ది దాని లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీ కాన్సర్ కారణంగా మూత్రం రంగు పింక్ కలర్ లేదా కోలా రంగులో మారుతుంది. వెన్నెముక తరుచుగా నొప్పి వస్తుంది. బరువు తగ్గడం, తరచుగా అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
.
జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కిడ్నీ క్యాన్సర్‌ను నివారించవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సాధారణ ప్రయత్నాల వల్ల కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. మీరు ధూమపానం, మద్యపానం చేసే అలవాటు ఉంటే మాత్రం తక్షణమే మానేయండి. వాటికి దూరంగా ఉండటం వలన కిడ్నీ క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధుల ప్రమాదాలను తగ్గించవచ్చు. అధిక బరువు, ఊబకాయంతో ఉన్నట్లయితే, ప్రతిరోజూ మీ కేలరీల తీసుకోవడం తగ్గించండి. శరీరం ఎప్పుడు యాక్టివ్ గా ఉండేలా చూసుకోండి.

 

Related News

Home remedies: రాత్రి దిండు కింద పెట్టే సింపుల్ హోమ్ రెమిడీ.. ఇలా చేస్తే..

Onion juice: జుట్టుకు ఉల్లిపాయ రసం రాస్తున్నారా? వీటిని కలిపితే..

Home remedies: కఫం, జలుబు వేధిస్తున్నాయా? ఈ సింపుల్ హోమ్ రెమిడీతో ఇట్టే మాయమైపోతాయి

Independence day Recipes: ఇండిపెండెన్స్ డేకు మూడు రంగుల్లో పులావ్, దోశ చేసి దేశభక్తిని చాటుకోండి

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. స్పెషల్ కోట్స్, విషెస్ చెప్పండిలా..

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవం.. ఆగస్ట్ 15న జరుపుకోవడానికి వెనక ఇంత కథ ఉందా ?

Big Stories

×